YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ వార్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య సోషల్ వార్

హైదరాబాద్, జూన్ 28,
సోషల్ మీడియాలో బీజేపీ దూకుడును తట్టుకునేంత స్థాయిలో టీఆర్ఎస్ క్యాంపెయిన్ ఉండడం లేదంటూ ఇటీవల పార్టీలో జరిగిన అంతర్గత చర్చల అనంతరం ఉధృతి పెరిగింది. ట్విట్టర్‌లో మాత్రమే కాక ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ లాంటి అనేక ప్లాట్‌ఫారంలలో టీఆర్ఎస్ ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఎక్కడా టీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా రకరకాల పేర్లతో అన్ని సెక్షన్ల ప్రజలకూ అర్థమయ్యే తీరులో మోడీ వైఫల్యాలను ఇమేజ్‌ల రూపంలో తీసుకెళ్తున్నది. గత వారం ట్విట్టర్‌లో 'బై బై మోడీ' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలోకి వచ్చింది. బీజేపీపై ప్రకటించిన యుద్ధం తాజా రాష్ట్రపతి ఎన్నికలతో మరింత ఉధృతమైంది.ఎనిమిదేళ్ళ మోడీ పాలనలో దేశం మాత్రమే కాక కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఎదుర్కొన్న ఇబ్బందులు, వివక్ష, హామీలను తుంగలో తొక్కడం తదితరాలను షేర్ కార్డుల రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. మోడీ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టడాన్ని కూడా ప్రస్తావిస్తున్నది. త్వరలో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దూకుడును మరింత పెంచింది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ బహిరంగంగానే కామెంట్లు చేస్తుండడంతో టీఆర్ఎస్ కూడా అప్రమత్తమై సోషల్ మీడియాను మాగ్జిమమ్ స్థాయిలో వాడేస్తున్నది. మోడీ పరిపాలోని అసమర్ధత, వైఫల్యాలు అంటూ నోట్ల రద్దు, కరోనా టైమ్‌లో లాక్‌డౌన్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం, విదేశాల్లో భారత్ పేరు ప్రతిష్టలకు భంగం కలగడం.. ఇలాంటివన్నీ ప్రస్తావిస్తున్నది.తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ గిరిజన వర్శిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితరాలను ప్రస్తావిస్తున్నది. హైదరాబాద్ నగరానికి వరదలు వస్తే ఒక్క పైసా కూడా ఇవ్వని బీజేపీ హైదరాబాద్‌లో జాతీయ సమావేశాలను నిర్వహించడానికి ఎందుకు ఎంచుకున్నదని ప్రశ్నించింది. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ నిలదీస్తున్నది. కేంద్రానికి తెలంగాణ పన్నుల రూపంలో ఎనిమిదేండ్లలో ఇచ్చినదెంతో, తిరిగి చట్టబద్ధంగా రాష్ట్రానికి వచ్చినదెంతో లెక్కలతో సహా వివరించి అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఎక్స్ పోజ్ చేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మతాలకు అతీతంగా సహనంతో ఉన్న ప్రజలను ఇప్పుడు హిందు పేరుతో రెచ్చగొడుతున్న బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నదని ఆరోపిస్తున్నది.భారత్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీని, ప్రధాని మోడీని సాగనంపకపోతే దేశానికి, ప్రజలకు ప్రశాంతత ఉండదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే గద్దె దించాల్సిందేనంటూ ప్రజల్లోకి సామాజిక మాధ్యమాల ద్వారా వివరిస్తున్నది. రైల్వే, పోర్టులు, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని 'దొంగలబండి'తో పోల్చి 'దేశాన్ని అమ్ముకునేటోళ్ళు తెలంగాణకు వస్తున్నరంట.. మన ఆస్తులను అమ్మేయగల.. బీజేపీ దొంగలతో జర జాగ్రత్త' అంటూ ప్రచారం చేస్తున్నది. డబుల్ ఇంజన్‌తో డెవలప్‌మెంట్ అని చెప్పుకుంటున్న బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు దేశంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నదిమేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీ, నల్లధనం వాపస్, 10 కోట్ల ఉద్యోగాలు, రైతులకు డబుల్ ఇన్‌కం, అవినీతి నిర్మూలన, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, లోక్‌పాల్, 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ, ప్రతీ వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షల డిపాజిట్, నమామి గంగే.. ఇలాంటివన్నీ ఉత్త ముచ్చటేనని వ్యాఖ్యానిస్తూ బైబై మోడీ అనే హ్యాష్ టాగ్‌తో సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నాటికి మరో రూపంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేసే ప్లాన్ రూపొందుతున్నది.

Related Posts