YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖైరతాబాద్ మట్టి విగ్రహం సాధ్యమేనా

ఖైరతాబాద్ మట్టి విగ్రహం సాధ్యమేనా

హైదరాబాద్, జూన్ 28,
హైదరాబాద్ నగరంలో పీఓపీ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించొద్దని.. మట్టివిగ్రహాలనే పెట్టాలని జీహెచ్‌ఎంసీ అధికారులు చేపడుతున్న అవగాహన కార్యక్రమంపై ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా భారీ సంఖ్యలో పీఓపీ విగ్రహాలను ప్రతిష్ఠిస్తుండగా.. ఈసారి నగరమంతా మట్టి విగ్రహాలనే పెట్టాలంటే వీలుకాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దనే కోర్టు ఆర్డర్ ఉండడంతో అధికారులు సతమతం అవుతున్నారు. వేల సంఖ్యలో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలనే సమాలోచనలు చేస్తున్నారు. కాగా ఖైరతాబాద్ భారీ గణేశ్ విగ్రహం 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మానవాళి, పర్యావరణ పరిరక్షణ కోసం పీఓపీ, కెమికల్స్ రంగులతో తయారు చేసిన గణేష్ విగ్రహాలను వీడి, మట్టి విగ్రహాలనే పూజించాలన్న జీహెచ్ఎంసీ ప్రచారం ఎంత మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారిగా నగరవాసుల మైండ్ సెట్ మారదన్న విషయాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇప్పటికే మట్టి విగ్రహాలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతూనే, మరోవైపు మట్టి విగ్రహాలను ప్రతిష్టించారదన్న విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ ఏడెనిమిది దశాబ్దాలుగా పీఓపీ, కెమికల్స్ కలర్స్ తో తయారు చేసిన విగ్రహాలను పూజించేందుకు ఎక్కువ ఆస్తి కనబరుస్తున్న నగరవాసుల్లో కొందరు జీహెచ్ఎంసీ ప్రచారాన్ని బహిరంగంగానే ఖండిస్తున్నారు. పీఓపీ, కెమికల్ రంగులతో తయారు చేసే విగ్రహాలను పూజిస్తే తప్పేముందని బహాటంగానే ప్రశ్నిస్తున్నారు.పీఓపీ, కెమికల్స్ రంగులతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, కుంటలు, బావుల్లో నిమజ్జనం చేయరాదంటూ పర్యావరణ నిపుణలు, న్యాయస్థానాలు ఏళ్లుగా చెబుతున్నా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే పాలకులు ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయలేకపోయారు. ఇందులో ప్రజల సెంటిమెంట్ పేరిట రాజకీయాలు సైతం చోటుచేసుకున్నాయి. వీటి పర్యావసానంగా గత సంవత్సరం నిమజ్జనానికి సరిగ్గా మూడు రోజుల ముందే పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయారదని, ఇందుకు జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని హై కోర్టు ఖరాకండింగా తేల్చి చెప్పింది. ఒకవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే సమయం లేకపోవటం, మరో వైపు కోర్టును సృంతృప్తి పర్చలేకపోయిన జీహెచ్ఎంసీ అధికారులు ఆగమేఘాలపై సుప్రీం కోర్టును ఆశ్ర్రయించాల్సి వచ్చింది. అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే చివరి అవకాశమని, ఇకపై పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదని పేర్కొంటూ 2021లో పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి చిట్టచివరి అవకాశాన్నిచ్చింది. మట్టి విగ్రహాలపై అవగాహన పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ ఇటీవల జోన్ల స్థాయిలో నిర్వహించిన అవగాహన శిబిరాలకు హాజరైన పీఓపీ విగ్రహా తయారీదారులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆశించిన విధంగా నగరంలో మెజార్టీ సంఖ్యలో మట్టి విగ్రహాలు వెలుస్తాయా? లేక మళ్లీ పీఓపీ విగ్రహాలే ప్రతిష్టాపన అవుతాయా? అన్నది వేచి చూడాలి.వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనేది కొద్దేళ్లుగా మహానగరంలో స్టేటస్ సింబల్‌గా మారిందన్న విమర్శలున్నాయి. ఎంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నాం, ఎంత గ్రాండ్ గా సందడి చేస్తున్నామన్నదే ముఖ్యంగా మారిపోయింది. ఒక క్రమంలో వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయటం కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజానీకాన్ని సైతం ఇబ్బందులకు గురి చేయటంతో చందా కోసం బలవంతం చేయరాదన్న నిబందనను సైతం పోలీసులు తెరపైకి తెచ్చారు. కానీ నేటికీ కొందరికి వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ అనేది బిజినెస్ గా మారిపోయిందన్న విమర్శలు లేకపోలేవు. ప్రకృతిని సైతం దైవంగా ఆరాధించే అతి గొప్ప సాంప్రదాయంలో ప్రకృతిని ద్వంసం చేసేందుకు దైవ పూజను కారణంగా చూపటంపై అందరూ ఏకీభవించటం లేదు. కానీ మట్టి విగ్రహాలను పూజిస్తే భావితరాలకు అందించాల్సిన జల వనరులు సేఫ్టీగా ఉంటాయన్నది పర్యావరణ ప్రియుల వాదన. కొందరు భారీ ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేసి, పెద్ద క్రేన్లతో ఆ విగ్రహాలను భారీ వాహానాలపై తెచ్చి నిమజ్జనం చేస్తుంటారు. మరి కొందరు ఇంట్లో ప్రతిష్టించుకున్న మట్టి విగ్రహాలను, నెత్తినెత్తుకుని తమ భక్తి శ్రద్దలను చాటుకుంటారు. ఎవరెలా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారన్న విషయాన్ని పక్కన బెడితే మానవాళి, పర్యావరణకు ఎలాంటి ముప్పు కలగుకుండా నిర్వహిస్తున్నారన్నదే ప్రధానం.

Related Posts