YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

కోహెడ మండల శాఖ గ్రంథాలయంలో భారత దేశ మాజీ ప్రధాని పివి నరసింహరావ్ 101వ జయంతి వేడుకలు పురస్కరించుకుని సామాజిక కార్యకర్త ,పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో పివి జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పి వి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ సామాజిక వేత్త వలస సుభాష్ చంద్రబోస్ నేత మాట్లాడుతూ.. పివికి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని, హన్మకొండ జిల్లాను పివి జిల్లాగా నామకరణం చెయ్యాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో మేము పివికి భారతరత్న ఇవ్వాలని ,పివి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర , అనేక ఉద్యమాలు చెయ్యడం జరిగిందన్నారు. గత యేడాది నవంబర్ 28న, భారత్ భయోటెక్ సందర్శన కోసం వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు ప్రదర్శన చేసిన రాజును ప్రత్యేకంగా అభినందించారు. పివి అఖిల భారత కాంగ్రెస్ కమిటి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాని స్థితప్రజ్ఞ అపర చానీఖ్యులు వివాద రహితుడు బహుభాషా కొవిధుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు కరీంనగర్ జిల్లా (పాత) బీమదేవరపల్లి మండల్ వంగర గ్రామంలో జన్మించి మంథని నియోజకవర్గంనుండి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి అనేక శాఖల్లో మంత్రి పదవులు చేసి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా, కేంద్రంలో అనేక మంత్రి పదవులను అలంకరించి వాటికి వన్నెతెచ్చి ప్రపంచ దేశాల కు భారతదేశ ఖ్యాతిని గొప్ప తనాన్ని చాటిచెప్పిన మహనీయులు పివి అని కొనియాడారు.గత ఏడాది శతజయంతి ఉత్సవాలను యేడాది పాటు ఘనంగా నిర్వహించి పివి పేరు మీద వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సీఎం కేసీఆర్, శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె. కేశవరావు,రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు కి, రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితేల సతీష్ కుమార్ లకు సుభాష్ చంద్రబోస్ ,రాజు లు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. పివి పుట్టి పెరిగిన లక్నపెల్లి, వంగర గ్రామాలను మండలాలు గా ఏర్పాటు చేయాలని అన్నారు.జులై రెండు న బారత ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పివికి బారత రత్న ప్రకటించాలని స్నేహిపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన మేధావులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లనే తగిన గుర్తింపు గౌరవం లభించిందన్నారు. పివి స్వగ్రామమైన వంగర గ్రామంలో స్మృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలని ,సీఎం కేసీఆర్ కి ప్రత్యేకంగా విన్నవించుకున్నారు.  ఈకార్యక్రమంలో కోహెడ మండల పరిషత్ అధ్యక్షులు కొక్కుల కీర్తి - సురేష్ నేత, కూరేళ్ల మాజీ సర్పంచ్ కేతిరి రెడ్డి బాలరెడ్డి,గ్రంధాలయ పాలకులు చిట్యాల బాలయ్య ,మంద దయాకర్,మాంకాళి అంజయ్య చింతల బాలనర్సు,కుర్రు మల్లయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేముల శ్రీనివాస్ నేత, పీవీ నరసింహారావు అభిమానులు పాల్గొన్నారు.

ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అగ్రభాగాన నిలిపిన మహనీయుడు పీవీ -మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు :
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అగ్రభాగాన నిలిపిన మహనీయుడు పీవీ నరసింహారావు అని  మంథని ఎమ్మెల్యే  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని మంగళవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీవీ చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పివి  సంస్కరణలే నేటికీ ఈ దేశ ప్రగతికి మూలం అన్నారు. మన మంథని ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు  ఎదగడం మంథని ప్రాంతవాసులందరికి  గర్వకారణమన్నారు. పీవీ గారు ఏ బాధ్యతలు నిర్వహించిన సంస్కరణ విషయంలో ఎక్కడా కూడా రాజీపడలేదని,విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కొత్త ఒరవడిని మొదలుపెట్టి ప్రత్యేకమైన గురుకులాలు మొదలుపెట్టి గురుకులాలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నత శ్రేణిలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి రాష్ట్రస్థాయిలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులను మేధావులుగా విద్యావంతులుగా చేసిన మహనీయుడు పీవీగరన్నారు. నవోదయ విద్యాలయాలను నాంది పలికిన ఘనత పి.విదేనని,రాజీవ్ గాంధీ  మేనిఫెస్టోలో పెట్టిన సంస్కరణలు దిగ్విజయంగా ముందుకు నడిపిన ఘనత కూడా పి.వి కె దక్కుతుందన్నారు . ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పతంలో నిలిపిన దర్శకుడు, బహుభాషా కోవిదుడు దేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు.సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి భూ పంపిణీ చేసిన ఘనత వారిదే నన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా  ఒదిగి ఉండాలి అన్నది వారి నినాదమని, పీవీ నరసింహారావు ఆశయ సాధనలో ముందుకు సాగాలని వారి ఆశయాలను కొనసాగిస్తామనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సెగ్గెం రాజేష్, శశిభూషన్ కాచే, తొట్ల తిరుపతి యాదవ్, అజీమ్ ఖాన్, ఇనుముల సతీష్,  పెండ్రు రమాదేవి, అయేషా అరిఫ్,గోటికార్ కిషన్ జీ, మంథని సత్యం, మద్దెల రాజయ్య, నాంపల్లి సతీష్, రావి కంటి సతీష్, వేల్పుల పోచం, మంతెన శ్రీనివాస్, నాగుల రాజయ్య, తోకల మల్లేష్, ఆరేల్లి కిరణ్,ఇందరపు అనిల్ లతో పాటు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

Related Posts