YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మెగాకు కమలానికి గాలం...

మెగాకు కమలానికి గాలం...

హైదరాబాద్, జూన్ 30,
ఆంధ్ర ప్రదేశ్’లో పట్టు సాధించేందుకు బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తోంది. పావులు కదుపుతోంది. అందుకే, సినిమా ఇమేజ్, జనాకర్షణ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్’ పోకడలు నచ్చక పోయినా జనసేనతో కుదిరిన పొత్తును నిలుపుకుఎందుకు ప్రాధాన్యత ఇస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగు దేశంతో పొత్తుకు మొగ్గు చూపుతున్నారు. టీడీపీతో పొత్తు  లేకుండా వైసేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం సాధ్యం కాదని, పవన్ కళ్యాణ్ గుర్తించారు.అందుకే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీతో పొత్తుకు ఏ మాత్రం సుముఖంగాలేని, బీజేపీ పవన్ కళ్యాణ్,ను తమ వైపు నిలుపుకునేందుకు, చాలా గట్టి  ప్రయత్నాలే చేస్తోంది.  అయితే పవన్ కళ్యాణ్ ఇంకా అటూ ఇటూ ఉగుతున్న నేపధ్యంలో, ఇప్పడు మెగా స్టార్ చిరంజీవిపై కమల నాధులు కన్నేసినట్లు కనిపిస్తోందని రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న,రాజకీయ పండితులు అంటున్నారు.  నిజానికి చిరంజీవి, చాలా కాలంగా రాజకీయలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేస్తారని వార్త లొచ్చినా, వైసీపీ తరపున ఆయన రాజ్య సభకు వెళతారని పుకార్లు వినిపించినా, అవేవీ నిజం కాలేదు.అంతే కాకుండా, ఇటీవల ఒక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా, రాజకీయాలు రోజు రోజుకు మరింతగా కలుషితం అయిపోయాయని, అవేదన వ్యక్తం చేస్తూ, వేదిక మీద ఉన్న చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి మంచి పని చేసారని అన్నారు. అలాగే, మళ్ళీ రాజకీయాల వైపు చూడొద్దని, సూచించారు. ఆఫ్కోర్స్ అందుకు చిరంజీవి చిరునవ్వు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అనుకోండి, అయినా, చిరంజీవి సన్నిహిత వర్గాలు అయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రాకపోవచ్చనే, అంటున్నారు.  పవన్ కళ్యాణ్’ను తమ జట్టులో ఉంచుకునేందుకు, అదే విధంగా పార్టీ జాతీయ నాయకులు వచ్చినప్పడు నిర్వహించే బహిరింగ సభలు, మొన్నటి జీపే నడ్డ రాజమండ్రి  సభలా వెలవెలా పోకుండా ఉండేందుకు, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జనాకర్షణలో నెంబర్ వన్’గా ఉన్న చిరింజీవి గ్లామర్ ఉపయోగించుకోవాలని బీజేపీ ఆయన వైపు చూస్తోందని అంటున్నారు. , జూలై 4 వ తేదీన భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరంలో అల్లూరి సీతారారారాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే కార్యక్రమానికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవికి ఆహ్వానం పంపారు. ఇప్పడు, అదే విషయంగా రాజకీయ, మీడియా వర్గాలలో ఉహగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ బలపడాలంటే..ఓ ప్రజాకర్షక నేత అవసరం ఉందని బీజేపీ పెద్దలు ఎప్పుడోనే గ్రహించారు. ఆ గ్యాప్’ను ఫిల్ చేసందుకు గతంలోనూ చిరంజీవితో చర్చలు జరిపారు. అప్పట్లో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న పుకార్లు షికారు చేశాయి. అయితే, అవేవీ నిజం కాలేదు. అదలా ఉంటే, బీజేపీ వర్గాలు మాత్రం,  జూలై 4 వ తేదీన భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించడం వెనక ఎలాంటి రాజకీయ కారణం లేదని అంటన్నారు.  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మాజీ మంత్రిగా, ప్రసిద్ధ కళాకారుడిగా మాత్రమే చిరంజీవిని ఆహ్వానించినట్లు చెపుతున్నారు. గతంలో హైదరాబాద్’లో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లోనూ చిరంజీవి పాల్గొన్నారని గుర్తు చేస్తున్నారు. అయితే అదే సమయంలో చిరంజీవి తమ పార్టీలోకి వస్తానంటే, వద్దని ఎలా అంటామని, ఆయనకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, నేతలు పేర్కొంటున్నారు.

Related Posts