YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎంఐఎంకు షాక్...

ఎంఐఎంకు షాక్...

పాట్నా జూన్ 30,
రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో, రాజకీయ  నాయకులు ఎమ్మెల్యేలు, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం, తీసుకుంటారో ఉహించడం అన్ని  సందర్భాలలో కాకున్నా, కొన్ని సంధర్భాలో కొంచెం చాలా కష్టం. అందుకే కొన్ని కొన్ని వార్తల విన్నప్పుడు, అవునా ..? నిజమా? అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇవాళ రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం  సర్వ సాధారణ విషయం అయిపొయింది. అయినా, ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటే, అది విశేషమే అవుతుంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా పార్టీ మారతారు గానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారడం అనేది  కనీసం  ఉహించను కూడా ఉహించ లేము. కానీ, ఒకరు ఇద్దరు కాదు ఒకేసారి నలుగురు  మజ్లీస్’ ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షుడు ఒవైసీకి షాక్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించారు.అయితే, ఎంఐ ఎం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించింది, పార్టీ పుట్టిల్లు తెలంగాణలో కాదు, బీహార్లో. అవును  2020లో జరిగిన  బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మొదటి సారిగా 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సంచలనం సృష్టించింది. ఏకంగా ఐదు సీట్లను ఎంఐఎం గెలుచుకుంది. అంతకు ముందు మహారాష్ట్ర, కర్ణాటకలలో ఒకటీ అరా సీట్లలో గెలిచిన ఎంఐఎం బీహార్లో ఐదు సీట్లు గెలిచంది. ఈ గెలుపు ఇచ్చిన ఊపుతోనీ, ఒవైసీ యూపీ, పశ్చిమ బెంగాల్   సహా మరికొన్ని రాష్ట్రాలపైనా దృష్తి కేంద్రీకరించారు. అయితే, ఇంకెక్కడా కూడా ఎంఐఎం ముస్లిం ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు చేయడం మినహ మరే ప్రభావమూ  చూప లేదు. ఒక్క బీహార్’లో మాత్రమే 2019 ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, 2020లో ఐదు ఎమ్మెల్యే  సీట్లు గెలుకుని ఆ రాష్ట్ర రాజకీయలలో పాదం మోపింది.  అయితే, ఇప్పడు  అలా గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో  నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు.మజ్లిస్ బిహార్ విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు.ఆర్జేడీ నేత, బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ను కలిసిన తర్వాత వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షానవాజ్, ఇజార్ అస్ఫీ, అంజార్ నైమీ, సయ్యద్ రుక్నుద్దీన్ ఆర్జేడీ కండువా కప్పుకున్నవారిలో ఉన్నారు.ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై గతంలోనే పలు ఊహాగానాలు వచ్చాయి. కులాల ప్రకారం జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ తేజస్వీ యాదవ్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మజ్లిస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తారుల్ ఇమాన్ సైతం హాజరయ్యారు. ఆర్జేడీతో కలిసి ఓ వేదికను పంచుకోవడం మజ్లిస్ ఎమ్మెల్యేలకు అదే తొలిసారి.అమౌర్, కొచాధామ్, జోకిహాట్, బహదుర్గంజ్ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, గెలిచిన ఐదు సీట్లలో నాలుగింటిని ఇప్పుడు కోల్పోయింది.

Related Posts