YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రణరంగంగా బాసర ట్రిపుల్‌ ఐటీ

రణరంగంగా బాసర ట్రిపుల్‌ ఐటీ

అదిలాబాద్, ఆగస్టు 1,
బాసర ట్రిపుల్‌ ఐటీలో  మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో సమస్య ఒక్క అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. అయితే తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందేనని, లేకుంటే విపరీతమైన చర్యలు ఉంటాయని స్టూడెంట్స్ హెచ్చరిస్తున్నారు. బాసరలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ సిట్యువేషన్‌ అయితే మళ్లీ రిపీట్‌ కాకూడదనుకున్నారో అదే రిపీటైంది. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు మరోసారి పోరాటానికి దిగారు. కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తోన్న స్టూడెంట్స్‌.. ఈసారి తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా వారికి వారి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో బాసర ట్రిపుల్‌ ఐటీ ఇష్యూ స్టేట్‌ వైడ్‌ గా కాక రేపుతోంది. మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ ఇస్తే సరిపోదని, ఫైనలైజ్‌ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు.. బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధుల ఆందోళన ఊహించని విధంగా తీవ్రరూపం దాల్చుతోంది. స్టూడెంట్స్‌కు అండగా తల్లిదండ్రులు కూడా ధర్నాలో పాల్గొనడం, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడం ఇలాంటి ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి.కాగా.. విద్యార్ధుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తున్నామని ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ చెబుతున్నారు. ఆందోళన విరమించాలని సూచిస్తున్నారు. విద్యార్ధులు కోరుతున్నట్లుగా, ఎక్స్‌పర్ట్‌ కమిటీ పరిశీలన తర్వాత కొత్త మెస్‌ కాంట్రాక్టరును ఫైనలైజ్‌ చేస్తుందని చెప్పారు. తిండీతిప్పులు మానేసి ఆందోళన చేస్తోన్న స్టూడెంట్స్, తమ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు భోజనం చేయమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దాంతో, బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి రణరంగంలా మారింది.

Related Posts