YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

2024 ఆర్మీని సిద్దం చేస్తున్న జగన్

2024 ఆర్మీని సిద్దం చేస్తున్న జగన్

విజయవాడ, డిసెంబర్ 9, 
వైఎస్ జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అన్ని రకాలుగా ప్రత్యర్థులను కట్టడి చేసే ప్రయత్నాలను ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తులు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటూ ఎవరికి టిక్కెట్ ఇస్తే విజయం సాధ్యమవుతుందన్న దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇటు పీకే టీం నివేదికలు ఇస్తుండగా, జగన్ ఓన్ మీడియా నుంచి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలను కూడా ప్రారంభించారు. నాలుగు విమాన సర్వీసులు రద్దు గడప గడపకు అంటూ... సహజంగా ప్రతిపక్షాలు ముందుంటాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు విపక్ష పార్టీలు ముందుగానే సిద్ధమవుతాయి. అధికార పార్టీలు ఎప్పుడూ నిదానంగా ఎన్నికల నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీ విపక్షాల కంటే ముందుగానే జగన్ రంగంలోకి దిగారు. ప్రతి ఎమ్మెల్యేకు గడప గడపకు ప్రభుత్వం అంటూ కార్యక్రమం ఇచ్చారు. దానిపై నెలవారీ సమీక్ష చేశారు. ప్రతి ఇంటికీ ఈ ప్రభుత్వం నుంచి అందిన లబ్దిని నేరుగా తెలియజేయడం, వారి సమస్యలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఐదు నెలల క్రితమే జగన్ ప్రారంభించారు.  ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే కారణంతో జిల్లాల పర్యటనలకు కూడా జగన్ శ్రీకారం చుట్టారు. జిల్లాల నుంచే లబ్దిదారుల ఖాతాల్లో వివిధ పథకాల కింద నగదును బదిలీ చేస్తున్నారు. వీటిని కూడా ఎన్నికల ప్రచారం కార్యక్రమంగానే జగన్ ఉపయోగించుకుంటున్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులను చెప్పడమే కాకుండా, విపక్షాలను తీవ్రస్థాయిలో విమర్శించడం ద్వారా మరోసారి వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ నేతలకు లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. 175కు 175 స్థానాల్లో గెలవాల్సిందేనని వైసీపీ నేతలకు జగన్ టార్గెట్ పెడుతున్నారు. అంటే 175 టార్గెట్ గా పెడితే కనీసం 150 స్థానాలయినా దక్కుతాయని జగన్ ఆలోచన కావచ్చు.  తాజాగా జయహో బీసీ సదస్సు ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 82 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులను ఒక చోటకు చేర్చి వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే రాజకీయ భవిష్యత్ ఉంటుందని వారిలో భరోసా నింపే ప్రయత్నం చేసినట్లే కనపడుతుంది. తాము బీసీలకు ఈ నాలుగేళ్లలో ఏం చేసింది? భవిష్యత్ లో ఏం చేయనున్నామన్న దానిపై ఆయన సవివరంగా తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ బీసీ సదస్సులో రెండు గంటల పాటు ప్రసంగించడాన్ని చూస్తుంటే ఈసారి బీసీ ఓటు బ్యాంకుపై ఆయన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని చెప్పక తప్పదు. ఎంతమంది కలసి వచ్చినా తన వెంట నలుగురే ఉన్నారని చెబుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలేనని ఆయన పదే పదే చెప్పడం ఇందులో భాగమేనని అంటున్నారు.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లతో పాటు పార్టీ పరంగా కూడా ప్రతి యాభై ఇళ్లకు ఒక కార్యకర్తను నియమించుకునేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించనున్నారు. యాభై ఇళ్లకు సంబంధించి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సిన బాధ్యత ఆ కార్యకర్త మీద ఉంచుతారు. వీరితో పాటు బూత్ లెవెల్ కమిటీలను కూడా తయారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈరోజు పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద జగన్ ఇంకా ఎన్నికలు పద్దెనిమిది నెలలు ఉండగానే తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లే కనపడుతుంది. అన్నింటా మొహరిస్తున్నట్లు అర్థమవుతుంది. మరి ప్రజలు చివరకు ఎవరిని ఆశీర్వదిస్తారో చెప్పలేం కాని జగన్ మాత్రం విపక్షాల కంటే ఒక అడుగు అన్నింటా ముందు ఉండేందుకే ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పుక తప్పదు.

Related Posts