YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

15 రోజులు.. కోటి 50 లక్షల కుటుంబాలు...

15 రోజులు.. కోటి 50 లక్షల కుటుంబాలు...

రాజమండ్రి, డిసెంబర్ 9, 
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల జపం చేస్తున్నాయి. అయితే.. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ వైసీపీ సమన్వయ కర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై వారితో చర్చించారు. గడపగడపకు పార్టీని తీసుకెళ్లడంపై నేతలకు మాస్టర్‌ ప్లాన్‌ దిశానిర్దేశం చేశారు. గరిష్ఠంగా 15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను కలుసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వైసీపీ సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, మరో వ్యక్తి గృహ సారథులుగా ఉంటారని వివరించారు. ఆ విధంగా 15 వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారని సీఎం జగన్ పేర్కొన్నారు.అంతేకాకుండా, గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారని, రాష్ట్రం మొత్తమ్మీద 45 వేల మంది కన్వీనర్లు ఉంటారని తెలిపారు. కన్వీనర్లను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలు/నియోజకవర్గాల ఇన్చార్జిలకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. వీరిపై నియోజకవర్గాల పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఎంపికైన వారు పార్టీ నుంచి వచ్చే సందేశాలను, పబ్లిసిటీ మెటీరియల్ ను గడపగడపకు చేరవేస్తారని సీఎం జగన్ వివరించారు. బూత్ స్థాయి నుంచే బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని, నెట్వర్క్ ఎంత బలంగా ఉంటే గెలవడం అంత సులువు అవుతుందని అన్నారు. మొత్తం 175 స్థానాలు గెలవడమే అందరి కర్తవ్యం కావాలని ఉద్బోధించారు.

Related Posts