YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహిళలకు స్వేఛ్చ ఎందుకు లేదు

మహిళలకు స్వేఛ్చ ఎందుకు లేదు

తిరువనంతపురం, డిసెంబర్ 9, 
కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సంచలనంగా మారతాయి. ముఖ్యంగా నేరాలు, హింస వంటి ఘటనల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారతాయి. లైంగిక సంబంధాలు, వివాహేతర కలహాలు, మహిళలపై దాడులు.. వంటి ఘటనల్లో తీర్పులు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది కేరళ హై కోర్టు.. ఇప్పుడు ఎందుకు అంటారా.. తాజాగా కేరళ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడుల్లో రాత్రిపూట వారికి స్వేచ్ఛను ఇవ్వడం వల్లే అవుతున్నాయన్న వాదనను తప్పుపట్టింది. అందుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. అబ్చాయిలతో పాటు అమ్మాయిలకూ రాత్రి పూట స్వేచ్ఛ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కేవలం అమ్మాయిలు లేదా మహిళలు మాత్రమే రాత్రిపూట తిరిగేందుకు ఎందుకు ఆంక్షల చట్రంలో ఇరుక్కుంటున్నారని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. అబ్బాయిలు లేదా పురుషులకు ఇచ్చినంత స్వేచ్ఛను వారికి ఎందుకు ఇవ్వలేక పోతున్నామని నిలదీసింది. వెంటనే అందరినీ సమానంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాత్రిపూట భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లడం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.ఉన్నత విద్యా సంస్థలలోని హాస్టల్ లో రాకపోకలను రాత్రి 9.30 గంటల తర్వాత నియంత్రించే 2019 ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కామెంట్లు చేసింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు, కేవలం మహిళలు లేదా బాలికలకు మాత్రమే నియంత్రణ అవసరమని.. అబ్బాయిలు లేదా పురుషులు కాదని ఎలా నిర్ణయిస్తారని నిలదీసింది. ఆడపిల్లలు కూడా ఈ సమాజంలో జీవిస్తున్నారు. వారికి భద్రత ఇవ్వాలి. అంతేగానీ ఆంక్షలు విధించడం సరికాదు. క్యాంపస్‌ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హై కోర్టు స్పష్టం చేసింది.మహిళలు, బాలికల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఇతర హాస్టళ్లు ఉన్నాయని, అక్కడ కర్ఫ్యూలు లేవని కోర్టు పేర్కొంది. రాత్రికి భయపడకుండా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ స్వేచ్ఛ ఇవ్వాలి. స్త్రీలు, బాలికలకు రక్షణ కల్పించే రూపంలో పితృస్వామ్యం స్థానంలో మాతృస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పింది. అయితే..2019 ప్రభుత్వ ఉత్తర్వులు తమ హాస్టల్‌లో మాత్రమే అమలవుతున్నాయని పిటిషనర్లు వాదించారు. న్యాయం, సమానత్వం, మంచి మనస్సాక్షి దృష్ట్యా ఎటువంటి సమయ పరిమితులు లేకుండా క్యాంపస్ కు అనుబంధంగా ఉన్న రీడింగ్ రూమ్ ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోర్టు నుంచి మెడికల్ కాలేజీకి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.

Related Posts