YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కన్నా... కూల్ అయినట్టేనా

కన్నా... కూల్ అయినట్టేనా

విజయవాడ, జనవరి 28, 
బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ విషయంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ శివప్రకాష్, కన్నా లక్ష్మీనారాాయణ సమావేశం ఆసక్తిని కలిగిస్తోంది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిందీ సమావేశం. ఏకాంతంగా వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు. నెక్ట్స్‌ ఏం జరగబోతుందనే ఉత్కంఠ పార్టీ నాయకులతోపాటు కన్నా లక్ష్మీనారాయణ అనుచరుల్లో కూడా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో  అధ్యక్షుడు సోమువీర్రాజు వర్సెస్‌ కన్నా లక్ష్మీనారాయణ నడుస్తోంది. కన్నా వర్గాన్ని పూర్తిగా పట్టించుకోకుండా సోమువీర్రాజు ఏకపక్షంగా కార్యక్రమాలు చేసుకొని వెళ్లిపోతున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీటికి సపోర్టివ్‌గా ఈ మధ్య కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్‌ కూడా కాక రేపాయి. నేరుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని టార్గెట్‌ చేసుకొని సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడటంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అదే టైంలో ఇతర పార్టీల నేతలతో కన్నా లక్ష్మీనారాయణ వరుసగా భేటీ కావడంతో ఆయన పార్టీ మారుతున్నారనే పుకార్లు కూడా షికారు చేశాయి. ఈ మధ్య ఆయన అనుచరులు కూడా కొందరు రాజీనామా చేశారు. దీంతో కన్నా పార్టీ మార్పు ఖాయం అనుకున్నారంతా. కానీ ఇంతలో అధిష్ఠానం నుంచి వచ్చిన దూత కన్నాతో సమావేశం కావడం స్టోరీలో ట్విస్ట్‌లానే చెప్పవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ నేరుగా సోమువీర్రాజుపై ప్రశ్నలు సంధించడంతోపాటు ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కీలకమైన రెండు సమావేశాలకు హాజరుకాలేదు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గం భేటీకి, భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గం భేటీకి రెండింటికీ కూడా కన్నా లక్ష్మీ నారాయణ డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ రెండు సమావేశాలకు హాజరుకాలేదని ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ... ఏదో జరుగుతోందని మాత్రం పార్టీ అధిష్ఠానం గ్రహించించి.  అందుకే శివప్రకాష్‌ను పంపించిన చర్చించినట్టు తెలుస్తోంది. రాత్రి విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణ, శివప్రకాష్‌ సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటలపాటు సాగిందీ భేటీ. ఇందులో చాలాా విషయాలు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాత బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు.తాను ఎప్పుడూ పార్టీ మారతానని చెప్పలేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ. తనకి ఉన్న స్నేహం కారణంగానే కొందరు నేతలతో కలవడం జరిగిందన్నారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్‌తో సమావేశం స్నేహపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు కన్నా. అంతే కానీ పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సూచనలు అడిగేందుకే తనను శివప్రకాష్ కలిశారే తప్ప ఎలాంటి బుజ్జగింపులు కూడా జరగలేదన్నారు. పార్టీలో కొందరు రాజీనామా చేసిన విషయాలపై కూడా కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చాలా మంది అవమానాలు తట్టుకోలేక రాజీనామా చేస్తున్నారని అన్నారు. అన్నింటిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం నుంచి కన్నాకు ఎలాంటి భరాసా వచ్చింది. ఆయన నెక్ట్స్‌ ఎలాంటి స్టెప్‌ తీసుకోనున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఇంతీకీ ఆయన శాంతించారా లేకుంటే మళ్లీ ఏదైనా వైల్డ్ నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Related Posts