YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంగరంగ వైభవంగా రధసప్తమి వేడుకలు

ఆంగరంగ వైభవంగా రధసప్తమి వేడుకలు

శ్రీకాకుళం
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రధసప్తమి  వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమీషనర్ హరిజవహర్ లాల్ ఈ వేడుకలకు అంకురార్పణ చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అనంతరం క్షీరాభిషేకం నిర్వహించి ఆదిత్యుని నిజరూపానికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఈ ఉత్సవాలను సంప్రదాయ బద్దంగా జరిపించడానికి జిల్లా యంత్రంగం అన్ని ఏర్పాట్లను చేసింది. రధసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే రోగ శోక బాధలన్నీ తొలిగిపోతాయని భక్తుల విశ్వాసం.

Related Posts