YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జి-20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండటం గర్వంగా ఉంది-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జి-20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండటం గర్వంగా ఉంది-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

 తాజ్ కృష్ణలో స్టార్టప్ 20 ఇండియా సదస్సు ప్రారంభమైంది. స్టార్టప్ 20 సదస్సు జి-20 సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. స్టార్టర్ కంపెనీల అభివృద్ధి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో స్టార్టప్ సంస్థల సమన్వయంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జి-20 సమావేశాలకు దేశం నాయకత్వం వహిస్తుండటం గర్వంగా ఉంది. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఇండియా నినాదం. స్టార్టప్ 20 ఇన్సెష్షన్ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఆనందంగా ఉంది. యువతలో ఉన్న అభిరుచి, ఆసక్తి వల్లే మన దేశంలో స్టార్టప్ సంస్థలు విజయ పథంలో దూసుకెళ్తున్నాయి. కొవిడ్ ను దేశం ఎలా ఎదుర్కుందో పొరుగు దేశాలు చూశాయి. మా ప్రభుత్వం స్టార్టప్ కోసం ఎన్నో విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. స్టార్టప్ సంస్థల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఇంక్యుబ్రేటర్స్‌ను తీర్చిదిద్దింది. ఏడేళ్లలోనే మోదీ విజన్ వల్ల స్టార్టప్ సంస్థలతో దేశం పోటీపడగలిగింది’’ అని పేర్కొన్నారు.

Related Posts