YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమంత శాకుంతలం వాయిదా

సమంత శాకుంతలం వాయిదా

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ హీరో దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. స్టార్ డైరెక్టర్ శకుంతల, దుశ్యంతుల అందమైన ప్రేమ కావ్యంగా గుణ శేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తుండగా.. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో పాటు భారీ అంచనాలను కూడా నెలకొల్పింది. ఇక మణిశర్మ సంగీతం అయితే అప్పటి లోకంలోకి తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది కానీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు ఏంటి అనుకుంటున్నా సమయంలో ఈ సినిమా వాయిదా పడిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గతేడాది ఒకసారి వాయిదా పడి ఫిబ్రవరిని ఫిక్స్ చేసుకొంది. విఎఫ్ ఎక్స్ ఇంకా వాని కారణంగా రెండో సారి కూడా ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఫిబ్రవరిలో పోటీ ఎక్కువ ఉండడంతో గుణశేఖర్ ఆలోచిస్తున్నాడని ఇంకొందరు చెప్తున్నారు. ఈ వార్తల్లో ఏది నిజం అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్లీ వేసవిలోనే శాకుంతలం అడుగుపెట్టాలి. అప్పుడు ఇంకా పెద్ద పోటీ ఉండనుంది. మరి అధికారికంగా మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Posts