YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పరేడ్ మే సవాల్

పరేడ్  మే సవాల్

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో స్టేట్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నాయి. మూడు రోజుల గ్యాప్‌లో పరేడ్ గ్రౌండ్స్ వేదికగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణకు ప్లాన్ వేస్తున్నాయి. తెలంగాణకు వచ్చిన తర్వాత పీఎం, సచివాలయం ప్రారంభించిన తర్వాత సీఎం నిర్వహించే ఈ మీటింగ్స్‌లో ఇద్దరి స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.సెక్రటేరియెట్‌ను ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సర్కార్‌ను డిసాల్వ్ చేసే చేస్తారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. దీంతో బీజేపీ సైతం అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా వందే భారత్ రైలును ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్‌కు ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. వాయిదా పడింది.ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల ఇనాగ్రేషన్, అలాగే పలు జాతీయ రహదారులను ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ టూర్ ఫిక్స్ అయింది. దీంతో ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. మోడీ సభను సీరియస్‌గా తీసుకొని సక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. తెలంగాణపై కేంద్రం ఫోకస్ ఎంతలా ఉందనే ఇంపాక్ట్‌ను ప్రజలకు తెలియజేయాలని చూస్తున్నది. పరేడ్ గ్రౌండ్‌లో సభ నిర్వహించి భారీగా జన సమీకరణ చేయాలని చూస్తున్నది.పీఎం మోడీ వెళ్లిన వచ్చిన మూడు రోజుల తర్వాత సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సెక్రటేరియెట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నారు. మోడీ సభను మించేలా దీన్ని నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలకు ఆహ్వానం పంపించినట్లు తెలిసింది. కాగా, కేసీఆర్, మోడీ ప్రసంగంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అన్నీ పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య తీవ్రమైన పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే తగలబడేలా పరిస్తితి ఉంది.ఇలాంటి తరుణంలో ఒకే వేదికపై రెండు పార్టీలు సభలు నిర్వహించనున్నాయి. మూడు రోజుల గ్యాప్ తో రెండు పార్టీల సభలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్నాయి. ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న విషయం తెలిసిందే. పలు రైల్వే అభివృద్ధి పనులని ప్రారంభించిన అనంతరం మోదీ..పరేడ్ గ్రౌండ్ లో పార్టీ ఆధ్వర్యంలో జరిగే సభలో పాల్గొనున్నారు. మునుపటి కంటే భారీ స్థాయిలో సభన సక్సెస్ చేయాలని బి‌జే‌పి ట్రై చేస్తుంది. భారీగా జనాలని సమీకరించాలని చూస్తున్నారు.ఇక ఫిబ్రవరి 17న బి‌ఆర్‌ఎస్ సభ అదే గ్రౌండ్ లో జరగనుంది. బి‌జే‌పి కంటే భారీగా సభ నిర్వహించాలని చెప్పి బి‌ఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 17న కే‌సి‌ఆర్..సచివాలయంని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే..తర్వాత పరేడ్ గ్రౌండ్ లో భారీ సభకు ప్లాన్ చేశారు. సచివాలయం ప్రారంభోత్సవానికి పలువురు జాతీయ నేతలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే.ఇక మోదీ సర్కార్ టార్గెట్ గా ఈ సభ జరగనుండటం…జాతీయ రాజకీయాలని ఆకర్షిచేలా రాజకీయం జరగనున్న నేపథ్యంలో బి‌జే‌పి కంటే భారీగా జనాలని సమీకరించి సభని సక్సెస్ చేయాలని బి‌ఆర్‌ఎస్ ప్లాన్ చేస్తుంది.  అంటే రెండు పార్టీలు ఒకరిని మించి ఒకరు భారీ స్థాయిలో పరేడ్ లో సభ నిర్వహించాలని చూస్తున్నారు. మరి ఈ విషయంలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.

Related Posts