YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ-బీఆర్ఎస్ రెండూ దగ్గరవుతున్నాయా..?

 బీజేపీ-బీఆర్ఎస్ రెండూ దగ్గరవుతున్నాయా..?

హైదరాబాద్ మే 27
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ-బీఆర్ఎస్ రెండూ దగ్గరవుతున్నాయా..? అందుకే ఈ మధ్య అటు బీజేపీని బీఆర్ఎస్.. బీఆర్ఎస్‌ను బీజేపీ విమర్శించుకోవట్లేదా..? మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ అంటే ఒంటికాలిపై లేచే గులాబీ బాస్ కేసీఆర్ ఇందుకే సైలెంట్ అయ్యారా..? తెలంగాణలో అవసరమైతే బీఆర్ఎస్సే గెలవాలే తప్ప కాంగ్రెస్ మాత్రం అస్సలు గెలవకూడదని బీజేపీ కోరుకుంటోందా..? తెలంగాణలో గెలుపోటములు కంటే పార్టీ జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ భావిస్తోందా..? అంటే ఇదే అక్షరాలా నిజమని అటు ఢిల్లీలో.. ఇటు తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య అసలేం నడుస్తోంది..? బీజేపీ మాస్టర్ ప్లానేంటి..? అధికారంలోకి వచ్చేస్తున్నాం.. రోజులు లెక్కపెట్టుకోండని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు సడన్‌గా ఎందుకు ఢీలా పడిపోయిందనే విషయాలు  చూస్తే ...
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు అసలు సిసలైన ప్రధాన ప్రతిపక్షమన్నా, రెండో స్థానంలో ఉండేది ఏ పార్టీ అంటే.. కాంగ్రెస్సే అని రాజకీయ విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాలను బీజేపీ ఖండిస్తూ.. తామే ప్రధాన ప్రతిపక్షమని అంతేకాదు రానున్న ఎన్నికల్లో గెలవబోతున్నామని కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలనాథులు చెప్పుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని కౌంట్ డౌన్‌తో కూడా బోర్డులు సైతం బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర దర్శనమిచ్చాయ్. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. తాము అధికారంలో రావడం సంగతి దేవుడెరుగు కానీ.. కాంగ్రెస్‌ మాత్రం అధికారంలోకి రాకూడదని బీజేపీ భావిస్తోంది. ఇదంతా రాష్ట్రంలో ఉండే బీజేపీ నేతలు అనుకుంటున్నారంటే తప్పులు కాలేసినట్లే.. కేంద్ర పెద్దలే భావిస్తున్నారని తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ నేతే ‘చిట్‌చాట్‌’లో చెప్పడం ఇప్పుడు వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు.. కేసీఆర్‌ వ్యతిరేక అంశం నిర్మించడంలో బండి సంజయ్‌ విఫలమయ్యారని బీజేపీ నేతే చెబుతుండటం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలోకి వలసలు మాత్రం అస్సలే ఉండవని.. ప్రస్తుతానికి వలసలు క్లోజ్ అయ్యాయని ఢిల్లీ వేదికగా చెప్పడం ఇప్పుడీ వ్యవహారంపైనే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు కలిసినా బీజేపీ-బీఆర్ఎస్ గురించే చర్చించుకుంటున్నారు.

Related Posts