YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్

ఆదర్శంగా నిలుస్తున్న సింగరేణి కాలరీస్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కనుసన్నలలో సింగరేణి కాలరీస్ 4  ఏళ్ళలో ఎగిసిపడ్తున్న కెరటంలా ముందుకు సాగుతున్నది.దశాబ్దాల కాలంగా నిలిచిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారు. నాలుగేళ్లుగా సింగిరేణి సంస్థ కోల్ ఇండియాతో వివిధ అంశాల్లో పోటీ పడుతూ వస్తోంది. దేశంలోనే బొగ్గు పరిశ్రమలకు సింగరేణి ఆదర్శంగా నిలుస్తుంది. 2013-14 నుంచి 2017-18 ఆర్థిక కాలంలో బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, రవాణా, ఓవర్‌బర్డెన్ తొలగింపు, లాభాల్లో సింగరేణి దేశంలోనే నెంబర్ -1గా నిలుస్తున్నారు. 2013-14 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం  నాటికి వివిధ రంగాలలో సాధించిన వృద్ధి శాతం వివరాలిలా ఉన్నాయి.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సింగరేణిలో కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు.  13 దశాబ్దాల కాలంలో ఏనాడు లేని విధంగా నాలుగేండ్లలో నిధులను కేటాయించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్నడిన తర్వాత సింగరేణి కాలరీస్ కంపెనీలో మొత్తం మీద 7,200మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించారు. కంపెనీలో పనిచేస్తూ ప్రమాదావశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు చెల్లించే మ్యాచింగ్ గ్రాంటను  పది రెట్లు పెంచారు. గతంలో  కేవలం రూ. లక్ష ఇవ్వగా దీనిని రూ.10 లక్షలు చేశారు. విధి నిర్వహణలో ఉండి సహజ మరణం పొందితే మ్యాచింగ్ గ్రాంట్ గతంలో రూ. 75వేలు ఉండగా దానిని రూ.7.50లక్షలకు పెంచారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే అందుకు సంబంధించిన వడ్డీ యాజమాన్యమే చెల్లించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ అన్‌ఫిట్ కేసులలో ఉద్యోగం వద్దనుకునే వారికి ఏకమొత్తంగా రూ. 25లక్షలు ఇచ్చేలా లేదా నెలకు రూ. 25వేలు చెల్లించే విధానాన్ని యాజమాన్యం అమలు చేస్తుంది. కారుణ్య నియామకాల ప్రక్రియ కూడా కంపెనీలో వేగంగా సాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు మెడికల్ బోర్డు సమావేశమై 430 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలను యాజమాన్యం కల్పించింది. సీఎం ఆదేశాల మేరకు 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్ధూర్లుగా యాజమాన్యం అక్టోబర్ నెలలో రెగ్యూలరైజ్ చేసింది. కార్మికుల తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను యాజమాన్యం అమలు చేస్తుంది.  కార్మికుల కాలనీల్లోని క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కొరకు తొలిదశలో యాజమాన్యం రూ. 15కోట్లు మంజూరు చేసింది. విద్యుత్ ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ జయంతి, రంజాన్, క్రిస్టమస్ పర్వదినాలకు సెలవులను ప్రకటించారు. 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచారు.  గతంలో 18శాతం ఉన్న లాభాల బోనస్‌ను 2014-15లో 21శాతం పెంచి రూ. 102 కోట్లు, 15-16లో 23శాతా నికి పెంచి రూ.245కోట్లు, 16-17లో 25శాతానికి పెంచారు.  తెలంగాణ రాష్ట్రసాధనలో కీలక భూమిక పోషించిన సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ను కేసీఆర్ ప్రకటించారు. పండుగల అడ్వాన్స్‌గా పెద్ద మొత్తంలో పెంచారు. 

Related Posts