హైదరాబాద్ ..
నరేంద్ర మోడీ తన అధికారిక ట్వీట్ నుంచి తెలంగాణ పైన చేసిన కామెంట్స్ ను డిలీట్ చేస్కోవడం తో తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ఆయన అంగీకరించినట్టు అయ్యిందని ఎంపి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎన్నికలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశారు.. అందుకు బదులు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 నెలల కాలంలో తెలంగాణ లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ రీ ట్వీట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి ట్వీట్ ను చూసిన మోడీ తెలంగాణ లో జరుగుతున్న కార్యక్రమాలను వెరిఫై చేసుకొని ట్వీట్ ను డిలీట్ చేశారు. ఇప్పటికైనా మోడీ భజన బృందం తెలంగాణ అభివృద్ధిని చూసి విమర్శలు మానుకొని సహకరించాలని అన్నారు.