
నూజివీడు
త్వరలో మీ ఇంట్లో అశుభం జరుగుతుంది శాంతి పూజలు ప్రముఖ దేవాలయాల్లో చేస్తాను అని గ్రామస్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకుని వుడాయించే దొంగ స్వామీజీని ఎట్టకేలకు అరెస్ట్ చేసిన చాట్రాయి పోలీసులు వివరాలు ఎలా ఉన్నాయి ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం ఆరుగొలను పేటలో ఆ దాబా ఇంట్లో వారి అల్లుడు చనిపోయాడని తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో పెద్దమనిషి కూడా చేతబడులు చేశారు. దాని వలన మీ అల్లుడు చనిపోయాడని చెప్పి మరల కుమారుడికి గండం ఉందని చెప్పి అది తొలగిపోవాలంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేయాలని మాయమాటలు చెప్పి 61 వేల రూపాయలు నగదు తీసుకుని సంక్రాంతి పండుగకు అంత్రములు,పూజా సామాగ్రి పంపుతానని చెప్పి మోటార్ సైకిల్ పై పరారయ్యాడు. అంతేకాకుండా గతంలో 8 నెలల క్రితం నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఓ ఇంటికి వెళ్లిన స్వామీజీ మీ చిన్న కొడుకు జీవితం బాగోలేదు. అతనికి శాంతి పూజలు చేయాలి సమ్మక్క సారక్క దేవాలయంలో చేస్తే అతని జీవితం బాగుంటదని మాయమాటలు చెప్పి 26,400 నగదు తీసుకుని పరారయ్యాడు.ఇరువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ స్వామీజీ అయిన తూరపాటి.బాలయ్య(37) కోసం గాలింపు చేపట్టి సోమవారం ఉదయం చాట్రాయి నుండి పోలవరం వెళ్లే రహదారిలో బైక్పై ప్రయాణిస్తూ పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతనిని అదుపులోకి తీసుకుని అతని వద్ద రేకు బిళ్ళల పై బంగారం కోటింగ్ వేసిన బిళ్ళలను మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు,ప్రజలు ఎవ్వరో కూడా దొంగ స్వామీజీలను నమ్మి మోసపోవద్దని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానిత వ్యక్తులు గాని స్వామీజీలు గాని సంచరిస్తే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఈ దొంగ స్వామీజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరుస్తున్నట్లు నూజివీడు డిఎస్పి కె వి వి ఎన్ వి ప్రసాద్ తెలిపారు.