
విజయవాడ, మార్చి 19,
నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? లేకుంటే జూన్ లో పదవి ఇస్తారా? లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోను సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అన్నది ప్రశ్న.మరోవైపు బిజెపికి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది. బిజెపికి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరి తో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్ లో ఉన్నది ఒకే ఒక్క మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకు ఇవ్వాలా? బిజెపికి ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అయితే అది ఇప్పుడు ఇస్తారా? కొద్ది కొద్ది రోజులపాటు ఆగిన తర్వాత ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు పదిమంది కొత్తగా గెలిచినవారే. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లకు పక్కన పెడతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుందన్నది ఒకసారి కొత్త టాక్.నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవీకాలం ఆరేళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయనకు వెయిట్ చేయిస్తారని తెలుస్తోంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెబుతారని.. వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటివరకు ఆగాల్సిందేనని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.