YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వై నాట్ పులివెందుల...

వై నాట్ పులివెందుల...

కడప, మే 21, 
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడప గడపలో అడుగుపెట్టి తన సత్తా చాటిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గం పులివెందులలో అడుగుపెట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారట. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఇప్పుడు టీడీపీ రీసౌండ్ చేస్తుందన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే వైఎస్సార్ అంటే పులివెందుల, పులివెందుల అంటే వైఎస్సార్ అన్న పేరు నేటికీ అక్కడ కొనసాగుతోంది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయనే చర్చ జిల్లా రాజకీయాల్లో నడుస్తోంది. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్ లో నడుస్తున్న పులివెందులలో ఇప్పుడు పరిస్థితి కాస్త చేంజ్ కనబడుతోంది.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పులివెందుల ప్రజలు మాత్రం వైఎస్ ఫ్యామిలీ వెంటే నడిచారు. వైఎస్ వివేకానంద రెడ్డి మొదలుకొని వైఎస్సార్, వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి కేవలం వైఎస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న జనం ఇప్పుడు ఒక్కసారిగా మార్పుకోసం చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ వివేకా మృతి తర్వాత పులివెందులలో చాలా మార్పులు వచ్చాయట. ఆయన మరణం తర్వాత వైసీపీ ఏపీలో అధికారాన్ని కోల్పోయిందివైఎస్ వివేక మరణం తర్వాత కడప జిల్లాలోనే కాదు..జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో కూడా మార్పు మొదలైందట. మార్పు కావాలంటూ కోరుకుంటున్న జనం ఆ దిశగా అడుగులు వేస్తున్నారట. సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న కూటమి పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెంచిందట. జగన్ సొంత ఇలాకాలో ఫ్యాన్ పార్టీని దెబ్బకొట్టి సైకిల్ పవర్ ఏంటో చూపించాలన్న ఆలోచనతో టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త పొలిటికల్ స్కెచ్ వేశారని సమాచారం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్…టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తన పవర్ చూపించాడు.ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి మైండ్ గేమ్ నే మొదలుపెట్టి పులివెందులపై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే పులివెందుల నుంచి ఎమ్మెల్సీని గెలిపించుకొని ఉపుమీదున్న పార్టీలోకి మరింత మంది లీడర్లను కడప వేదికగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ మారగా..మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్లు టాక్ విన్పిస్తోంది.మహానాడు వేదికగా పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితులైన వారంతా ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారట. నలుగురు కౌన్సిలర్లు, ముగ్గురు ఎంపిటిసిలు, ఇద్దరు సర్పంచ్ లతో పాటు మరో ముఖ్య నేత సైకిలెక్కుతున్నట్టు పులివెందులలో సౌండ్ విన్పిస్తోంది. ఐతే వైసీపీ నేతలు చేజారిపోకుండా జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా..నేతలు మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తోంది.మహానాడు వేదికగా…పులివెందులలో వైసీపీని ఖాళీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారన్న వార్త ఆపార్టీలో ఫుల్ జోష్ ను నింపుతోందట. ఇదే నిజమైతే పులివెందులలో కూడా వైసీపీకి ఎదురీత తప్పదా అన్న వార్తలు విన్పిస్తున్నాయి. అయితే చంద్రబాబు వేసే రాజకీయ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. బాబు వేసే పొలిపటికల్ స్కెచ్ లకు ధీటుగా ఎలా అడుగులు ముందుకు వేయబోతున్నారనేది చూడాలి
 

Related Posts