
హైదరాబాద్, జూన్ 6,
రాజాసింగ్. కట్టర్ హిందూ. 2018లో తెలంగాణలో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఆయనదే. తెలంగాణలోనే కాదు..నార్త్ స్టేట్స్‌లో రాజాసింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రాజాసింగ్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కాక రేపుతున్నారు. ధిక్కార స్వరం వినిపిస్తూ..ఏకంగా స్టేట్ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని తెలియజేస్తూ..రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పాత సామాన్లను బయటకు పంపితే పార్టీ బాగుపడుతుందని డా.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి లాంటి నాయకులపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు రాజాసింగ్.హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, ఎంపీ అభ్యర్థిగా మాధవీలత సెలక్షన్, గోల్కొండ జిల్లా అధ్యక్ష పోస్ట్ విషయంలో..ఇలా అడపా దడపా రాష్ట్ర నాయకులపై రాజాసింగ్ తన గళం వినిపిస్తూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కరెక్టే అన్నట్లుగా..రాజాసింగ్ స్పందించిన తీరే పెద్ద చర్చకు దారితీసిందిబీజేపీలో విలీనం చేసేందుకు బీఆర్ఎస్ సిద్దమైందని కామెంట్స్ చేసి ఎమ్మెల్యే కవిత కారు పార్టీలో కలకలం సృష్టించారు. తమ పార్టీ నేతలు మంచి ప్యాకేజీ ఇస్తే దేనికైనా సిద్ధపడుతారంటూ రాజాసింగ్ బీజేపీలో రచ్చకు తెరలేపారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారట. రాజాసింగ్ లైన్ దాటుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట. రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారట. ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న రాజాసింగ్..సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన క్యాడర్‌పై కాకుండా వారి వెనకున్న నాయకుల టార్గెట్‌గా అటాక్ షురూ చేశారట.ఈ విషయాలన్నీ నిశితంగా గమనిస్తున్న జాతీయ నాయకత్వం రాజాసింగ్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మూడు, నాలుగు సార్లు, గెలిచినంత మాత్రన వారు ఏది మాట్లాడినా సాగుతుందని అనుకోవద్దని అవసరం అనుకుంటే చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుందని..ఇటీవల జరిగిన వర్క్ షాప్‌లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ హెచ్చరించారు.ఈ క్రమంలోనే రాజాసింగ్‌కు నోటీసులు ఇస్తారన్న దానిపై పార్టీ ఆఫీస్‌లో చర్చ జరుగుతుంది. నోటీసులు ఇస్తారన్న మ్యాటర్ లీక్ కావడంతో గోషామాల్ ఎమ్మెల్యే స్వరం పెంచారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదు దమ్ముంటే సస్పెండ్ చేయాలని సవాల్ చేస్తున్నారు. తాను బయటికి వెళ్లే ముందు అందరి బండారాన్ని బయటపెడతానని హెచ్చరిస్తున్నారు.అయితే రాజాసింగ్ కామెంట్స్..అందుకు బీజేపీ నేతల నో రియాక్షన్ చూస్తుంటే.. అసలు ఏం జరుగుతుందో పార్టీ క్యాడర్, లీడర్లకు అర్థం కావడం లేదట. బీజేపీని రాజాసింగ్ టార్గెట్ చేస్తున్నారా? లేక రాజాసింగ్‌నే రాష్ట్ర పార్టీ నేతలు టార్గెట్ చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదట. బండి సంజయ్‌తో పాటు పలువురు నేతలు తనతో బానే ఉంటూ..కిషన్‌రెడ్డితో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని భావిస్తున్నారట రాజాసింగ్. అందుకే అందరినీ టార్గెట్ చేస్తూ..రాజాసింగ్ అటాకింగ్ స్టార్ట్ చేశారని అంటున్నారు.2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నానని..అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుని గోసేవ చేసుకుంటున్నానని చెప్తున్నారట రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాలని, కానీ రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదంటున్నారాయన. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు.ఇప్పటికే 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత జాతీయ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు మరోసారి ఆయనపై చర్యలు తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. కమలం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రాజాసింగ్ వెనుక ఎవరున్నారనేది హాట్ టాపిక్‌గా అవుతోంది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతల సపోర్ట్‌తోనే రాజాసింగ్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.