YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ మౌనం ఎందుకో...

 రేవంత్ మౌనం ఎందుకో...

హైదరాబాద్, జూన్ 6, 
సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే పదేళ్ల పాటు రాజకీయ పోరాటం చేసి..సమయం వచ్చిన ప్రతీసారి గులాబీ పార్టీని, ఆ పార్టీ లీడర్లను కార్నర్ చేస్తూ వస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా రేవంత్‌ మెయిన్ టార్గెట్‌ బీఆర్‌ఎస్సే. ఇష్యూ ఏదైనా..సమయం, సందర్భం కాకపోయినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా రేవంత్ ప్రసంగం ముగిసేది కాదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌లో పెద్ద రచ్చే జరుగుతోన్న రేవంత్‌ రియాక్ట్ కాకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.ఎమ్మెల్సీ కవిత లెటర్, కేటీఆర్ టార్గెట్‌గా ఆమె విమర్శలు ఒక ఎత్తు అయితే..కేసీఆర్‌కు కాళేశ్వర కమిషన్‌ నోటీసులపై ధర్నా చేశారు కవిత. అంతేకాదు గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా మాటల తూటాలు పేలుస్తున్నారు. కవిత అధికార పార్టీని అంత టార్గెట్ చేస్తున్నా, బీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని చర్చ జరుగుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ చిన్న ఇష్యూపైనా అయినా వెంటనే రియాక్ట్ అయ్యే రేవంత్..ఆ పార్టీలో పెద్ద దుమారే చలరేగుతున్నా ఎందుకు స్పందించడం లేదన్న చర్చ మొదలైంది.అంతేకాదు కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారన్న ప్రచారం జరిగింది. రేవంత్‌రెడ్డే కవితతో లేఖ రాయించారన్న గుసగుసలు వినిపించాయి. అంతే కాకుండా కవిత కేసీఆర్‌కు రాసిన లెటర్‌ లీకవ్వడం వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.ఆరుగురు ఎమ్మెల్యేలతో వస్తానని మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారనే వార్తలు వచ్చాయి. ఆ ప్రచారాన్ని కవిత కొట్టేపారేశారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ ముగినిపోయే నావ, ఆ పార్టీలో తానెందుకు చేరతానంటూ కామెంట్ చేశారు కవిత. ఆమె వ్యాఖ్యలపై మంత్రుల నుంచి హస్తం పార్టీ సీనియర్ లీడర్ల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. రేవంత్‌ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిరేపుతోన్న అంశం.మాజీ సీఎం కేసీఆర్‌కు సంబంధించిన ఏ అంశంపైనైనా క్షణాల్లో రియాక్ట్ అయ్యే సీఎం రేవంత్..ఈ సారి కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నా ఎందుకు స్పందించడం లేదన్నది అందరిలో మెదిలే ప్రశ్న. అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా కవిత చేసిన విమర్శలు, ఆరోపణలపై రేవంత్ రెడ్డి తప్పనిసరిగా రెస్పాండ్‌ అవుతారని అంతా భావించారు. బీఆర్ఎస్ పార్టీలోని అన్ని అంశాలపై నేరుగా మాట్లాడకపోయినా కనీసం మీడియాతో చిట్ చాట్‌లోనైనా స్పందించే రేవంత్ ఈ సారి ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.కనీసం కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నారన్న ప్రచారం జరిగినప్పుడైనా ఆయన స్పందిస్తారని రాజకీయవర్గాలు భావించాయి. కానీ రేవంత్ సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. అదీ కాకుండా కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరిగినప్పుడు కూడా రేవంత్ రెస్పాండ్ కాలేదు. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందని కూడా కవిత చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని విమర్శించే రేవంత్..కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్‌ కాలేదన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ అంశాల్లోనే కాదు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిచ్చిన అంశంపైనా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి స్పందించలేదు. ఇలా కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్‌కు సంబంధించిన ఏ అంశంపైనా ముఖ్యమంత్రి రియాక్ట్ కావడం లేదు. బీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తితేనే ఒంటికాలుపై లేచే రేవంత్ రెడ్డి..ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనం వహించారన్నదే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి రేపుతోంది.

Related Posts