
హైదరాబాద్
శుక్రవారం తెల్లారిజామున 3 గంటలకు నటుడు అఖిల్ అక్కినేని, జైనాబ్ ల వివాహం జరిగింది. జూబ్లీ హిల్స్ లోని నాగార్జున అక్కినేని హౌస్ లో పెళ్లి వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితరులు హజరయ్యారు. జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియో లో రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్, బడా రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హజరు కానున్నారు. ఆదివారం జరిగే రిసెప్షన్ ను అక్కినేని ఫ్యామిలీ భారీ లెవల్ లో నిర్వహిస్తోంది.