YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి?

కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు.కిరణ్ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వస్తున్న వార్తలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరనున్నారని వస్తున్న ఊహాగానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.‌ ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కేయడంతో ప్రజల్లో భాజపాపై వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 2019లో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించడమూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించింది. ఈ క్రమంలోనే విభజన తర్వాత పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్రంలో పునర్‌వైభవం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకుంటే శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చని అధిష్ఠానం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి సొంత గూటికి చేరేలా ముఖ్యనేతలు మంతనాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. నిన్న మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు కూడా ఆయన ఇంటికి వెళ్లి చర్చించిన సంగతి తెలిసిందే. సుబ్బిరామిరెడ్డి సైతం కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చినట్లు విలేకరుతో చెప్పడం గమనార్హం.రాష్ట్రం విడిపోయాక 2014 లో కిరణ్ కుమార్ రెడ్డి స్వతంత్రంగా జై సమైకాంద్ర పార్టీ ని స్తాపించారు.2014 సాదారణ ఎన్నికల్లో రాస్త్రసం లోని అన్ని స్తానాలకు  పోటి చేసారు.

Related Posts