YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

50 కోట్ల క్లబ్ లో చేరిన 'గీత గోవిందం'

 50 కోట్ల క్లబ్ లో చేరిన 'గీత గోవిందం'

 పరశురామ్ దర్శకత్వంలో విజయదేవరకొండ కథానాయకుడిగా నటించిన 'గీత గోవిందం' చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది.  చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts