YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన

 రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన
పశ్చిమ బెంగాల్-ఉత్తర కోస్తా ఒరిస్సా ప్రాంతాలని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం మరియు కొన్ని చోట్ల  భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల  భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఈరోజు కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ మరియు గుంటూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఎల్లుండి కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమ లో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు  రాయలసీమలో ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts