YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

8800 కోట్ల మహిళా రుణాలు : మంత్రి జూపల్లి

 8800 కోట్ల మహిళా రుణాలు : మంత్రి జూపల్లి
రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి 902 కోట్ల బకాయిలను విడుదల చేశాం. మరో 339 కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉంది, వీటిపై కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేసి విడుదల చేసేందుకు కృషి చేస్తున్నాం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7900 కోట్ల రుణాలను బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా అందజేశామని రాష్ట్ర పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ 8800 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, ఇందులో ఇప్పటికే దాదాపు 2 వేల కోట్ల రుణాలను అందజేశాం. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్యలోపం లేకుండా స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైతే అదనంగా దినసరి కూలీలను తీసుకుని పారిశుద్ధ్యలోపం లేకుండా చూడాలి. కేంద్రం నుండి జోనల్ సిస్టంపై క్లారిటీ రాగానే కొత్తగా గ్రామ కార్యదర్శుల నియామకం వుంటుందని అయన అన్నారు. త్వరలోనే పంచాయతీల ద్వారా 500 మందికి ఒక పారిశుద్ధ్య కార్మికుడి నియామకం వుంటుంది. ఇప్పటి వరకు అతి తక్కువ వేతనాలతో పంచాయతీల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. మానవతా దృక్పథం పారిశుద్ధ్య కార్మికులకు 8500 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని సీయం గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేతనాన్ని నేరుగా కార్మికుల ఖాతాలోనే  గ్రామ పంచాయతీలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. 112, 212 జీవోల మేరకు 1994 కన్నా ముందు నుండి పనిచేస్తున్న వారిని 90 శాతం రెగ్యులరైజ్ చేశాం, మిగిలి పోయిన వారు ఎవరన్నా ఉంటే వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని మంత్రి అన్నారు. కేరళ వరద బాధితులకు అందరం అండగా నిలుద్దాం, నా నెల వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నానని అయన వెల్లడించారు.

Related Posts