YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉత్తమ్ వర్సెస్ కేటీఆర్

ఉత్తమ్ వర్సెస్ కేటీఆర్
గులాబీ పార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ని బ‌చ్చాఅంటూ పీసిసి చీఫ్ ఉత్త‌మ్ చేసిన వాఖ్య‌లు రెండు పార్టీల మ‌ద్య మాట‌ల మంట‌ల్ని రేపుతున్నాయి. ఏనాడైనా ఉత్త‌మ్ ఉద్య‌మంలో పాల్గొన్న చ‌రిత్ర ఉందా అంటూ గులాబి నేత‌లు కౌంటర్ ఇస్తున్నారు.త‌మ నేతపై మ‌రోసారి విమ‌ర్శ‌లు చేస్తే తీవ్ర‌ప‌రిణాలు ఉంటాయ‌ని అధికార పార్టీ నేత‌లు హెచ్చ‌రించారు. ఇంత‌కు కేటీఆర్ ని ఉత్త‌మ్ ఎందుకు టార్గెట్ చేశారు.. ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాలతో  తెలంగాణ లో  కేటీఆర్ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీలా రాజ‌కీయం సాగుతోంది. కొన్ని రోజులుగా కేటీఆర్ నే టార్గెట్ చేస్తూ పీసిసి చీఫ్ ఉత్త‌మ్ తో పాటూ ఇత‌ర  కాంగ్రెస్ నేత‌లంతా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.మ‌రోవైపు కేటీఆర్ సైతం ప‌లు స‌భ‌ల్లోనూ, ట్విట్ట‌ర్ వేదిక‌గానూ హ‌స్తంనేత‌ల‌పై మ‌రి ముఖ్యంగా పీసిసి చీఫ్ ఉత్త‌మ్ పై ఘాటైన వాఖ్య‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్కాంగ్రెస్ పార్టీ అని...అధినేత రాహుల్ గాంధితో పాటూ..తెలంగాణ కాంగ్రెస్ నేత‌లంతా అవినీతి కేసుల్లో బెయిల్ పై తీరుగుతున్నవాళ్లేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఒక్క‌సీటు కూడ రాద‌ని...రాబోయే రోజుల్లో హ‌స్తం పూర్తిగా ఖళీకాబోతుందంటూ ఎద్దేవ చేశారు. అంతేకాదు....గ‌డ్డం పెంచిన వాల్లంతా గ‌బ్బ‌ర్ సింగులు కాదంటూ ప‌రోక్షంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శ‌లు గుప్పించారు కేటీఆర్.మ‌రోవైపు కేటీఆర్ వాఖ్య‌లను కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా తీసుకుంది.కేటీఆర్ టార్గెట్ గా విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టింది.ముఖ్యంగా ఈ మ‌ద్య‌కాలంలో కేటీఆర్ కాబోయే సీఎం అంటూ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల త‌ర్వ‌త కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌వైపు వెళ్తార‌ని..పార్టీ అధికారంలోకొస్తే కేటీఆర్ ను సీఎం చేస్తార‌ని వాద‌న అటు పార్టీలోనూ ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. హ‌స్తం పార్టీనేత‌లు కేటీఆర్ టార్గెట్ గానే మాట‌లకు ప‌దును పెట్టారు. అందులో బాగంగానే తాజాగా పీసిసి చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ వేదిక‌గా కేటీఆర్ పై సెటైర్లు విసిరారని చ‌ర్చ‌సైతం న‌డుస్తోంది. కేటీఆర్ కు రాజ‌కీయ అనుభ‌వం లేని బాలుడ‌ంటూ...అమెరికా నుంచి వ‌చ్చి తండ్రి కేసీఆర్ స‌హాయంతో మంత్రి అయ్యాడ‌ని కామెంట్స్ చేశారు. అంతేకాదు అహంకారంతో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శిస్తున్నాడ‌ని కేటీఆర్ పై ఉత్త‌మ్ ప‌దునైన వాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమం లో ఒక్క రోజు పాల్గొనని ఉత్తమ్ కి కేటీఆర్ ని బచ్చ అని హక్కు లేదు అన్నారు మంత్రి తలసాని..వి ఎచ్ హనుమంతరావ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది అని హెచ్చరించారు....కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్  ఒక బచ్చా... అతని ప్రక్కన తిరిగే వారు కేటీఆర్ ని విమర్శిస్తారా అని ప్రశ్నించారు...రాహుల్ గాంధీ కి పార్లమెంట్ లో కౌగిలించుకోవడం,కన్ను కొట్టే అలవాటు తప్ప ఏమీ రాజకీయా అనుభవం ఉంది అని ఎద్దేవా చేశారు మంత్రి.ఇక కేటీఆర్ బ‌చ్చా అంటూ ఉత్త‌మ్ చేసిన వాఖ్య‌లు ఇప్పుడు అధికార పార్టీ నేత‌ల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించాయి. ఏకంగా టీఆరెఎస్ ప్ర‌జాప్ర‌తినిధులంతా ఉత్త‌మ్ పై ఫైర్ అయ్యారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్య‌మంలో ఏనాడైనా పోరాడిన దాఖ‌లాలు ఉన్నాయా అంటూ టీఆరెఎస్ నేత‌లంతా మండిప‌డ్డారు. కేటీఆర్ ఉద్య‌మంలో పాల్గొని ..కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగార‌ని...కాంగ్రెస్ నేత‌లు మాత్రం అవినీతి కేసుల్లో కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్త‌మ్ కున్న రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా....సిన్సియారిటితో ఉన్నార‌ని...మంత్రిగా అచ్చా అనిపించుకుంటున్నార‌ని టీఆరెఎస్ నేత‌లు తెలిపారు.మొత్తానికి ఎన్నిక‌ల హ‌డావిడి  మొద‌ల‌వడంతో అధికార,ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మ‌ధ్య రాజుకున్న విమ‌ర్శ‌ల వేడి ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో వేచి  చూడాల్సిందే.

Related Posts