YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టిఆర్ఎస్ సభ వాయిదా... ?

టిఆర్ఎస్ సభ వాయిదా... ?
తెలంగాణ‌లో ఎన్నిక‌ల హ‌డావిడి వేళ అధికార పార్టీ నిర్వ‌హించాల‌నుకున్న భారి బహిరంగ స‌భ వాయిదా ప‌డబోతుందా....?భారి వ‌ర్షాలు స‌భ‌కు అడ్డంకులుగా మారాయా...?పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ చూస్తుంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి....స‌భ ర‌ద్దు కు సంబందించి అధికారికంగా పార్టీ ప్ర‌క‌టించ‌క‌పోయినా...గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఇక మ‌రో తేదిని ప్ర‌క‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.తెలంగాణ‌లో వ‌చ్చే ఆరునెలల్లో ఎన్నిక‌ల‌కు వెళ్లబోతున్నామంటూ ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్..సెప్టెంబ‌ర్ నెల‌లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. అసెంబ్లీ ర‌ద్దు చేసే ముందు హైద‌రాబాద్ లో భారి భ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించాల‌ని..అందుకు సెప్టెంబ‌ర్ 2 తేదిని ఎంచుకున్నారు. న‌గ‌ర శివార్ల‌లో 25ల‌క్ష‌ల‌మందితో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ త‌ల‌పెట్టారు కేసీఆర్. దీనికి సంబందించిన పార్టీ సెక్రెట‌రి జన‌ర‌ల్ గా ఉన్న కేశ‌వ‌రావుకు భాద్య‌త‌లు కూడ అప్ప‌గించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంనుంచి జ‌న‌స‌మీక‌ర‌ణ భారిగా ఉండాల‌ని..చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా స‌భ నిర్వహించాల‌ని అనుకుండ‌గా..వ‌రుణిడి రూపంలో స‌భ వాయిదా ప‌డే అవ‌కాశాలుకనిపిస్తున్నవి..ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా క‌నీవిని ఎరుగ‌ని రీతిలో కుండా పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 20ఏళ్ల‌లో ఎన్న‌డూ న‌మోదు కానంత వ‌ర్ష‌పాతం జిల్లాల్లో న‌మోద‌వుతుంది. చెరువులు వాగులు వంక‌లు రిజ‌ర్వాయ‌ర్లు అన్ని పొంగిపొర్లుతున్నాయి. వారంరోజుల‌గా తెలంగాణ అంత‌టా ముసురుప‌ట్టింది.దీంతో స‌భ‌కు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి. మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులంతా స‌భ‌కు జ‌న స‌మీక‌ర‌ణ విష‌యంలో కాకుండా...వ‌ర్షాల‌పై అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించే అంశంపై దృష్టిపెట్టారు. దీంతో పార్టీ విసృత‌స్థాయి స‌మావేశాన్ని వాయిదా వేసిన‌ట్లుగానే స‌భ‌ను కూడ వాయిదా వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.సెప్టెంబ‌ర్ రెండు స‌భ‌కు సంబందించి ఇప్ప‌టివ‌ర‌కు వాయిదా వేసిన‌ట్లు ప్ర‌క‌టించ‌క‌పోయినా...స్థానిక నేత‌ల‌కు మాత్రం సూచ‌న‌లు వెల్లాయి. ఒక‌వేళ స‌భ‌ను నిర్వ‌హించాలంటే ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలో స‌న్నాహ‌క స‌ద‌స్సులు,స‌భ‌కు త‌ర‌లివెళ్లేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగేవి. ఇప్ప‌టికిప్పుడు వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టినా...అంత భారి స‌భ నిర్వ‌హించాలంటే ప‌ట్టుప‌ని 10రోజులు కూడా స‌మ‌యం లేదు. మ‌రోవైపు హైద‌రాబాద్ లో ఎక్క‌డ స‌భ నిర్వ‌హించాల‌న్న స్థ‌లం కూడ ఫైనల్ అవ్వ‌లేదు. దీంతో సెప్టెంబ‌ర్ రెండు స‌భ వాయిదా ప‌డిన‌ట్లేనంటూ పార్టీలో చ‌ర్చ‌జ‌రుగుతుంది. మ‌రోవైపు సెప్టెంబ‌ర్ రెండో వారం లేదా మూడో వారంలో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు పార్టీలో చర్చ జరుగుతుంది....

Related Posts