ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదు : వర్మ

అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. శ్రీదేవి ప్రేమించే అందరికి నా సంతాపం’ అంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ‘నాకు ఈ విషయం నమ్మాలని లేదు. ఓ లెజెండ్ ఇక లేరు. భారతీయ సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేర’ని ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు సుస్మితాసేన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రితేష్ దేశ్‌ముఖ్, అనుష్క శర్మ, అను ఇమ్మాన్యూల్, ప్రీతీ జింతా, సిద్ధార్థ్ మల్హోత్రా, జానీ లివర్, జరీన్ ఖాన్, మధుర్ బండార్కర్, అద్నాన్ సమీ, గౌతమి తదితరులు సోషల్ మీడియాలో స్పందించారు.