YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సంపాదకీయం

వినాశకరం.. స్వతంత్ర ప్రతిపత్తిపై పెత్తనం

Admin 3rd Apr, 2018

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పటిష్టతకి, రక్షణకి రాజ్యాంగంలోని న్యాయవ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ,  కార్యనిర్వాహక వ్యవస్థ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో విధి విధానాలను నిర్దేశించడం జరిగింది. ఒక వ్యవస్థ మరొక వ్యవస్థపై సమతుల్యం కోసం ఆధారపడటమే తప్ప ఒక వ్యవస్థ వేరొక వ్యవస్థపై ఆధిపత్యం కనపరచడానికి అవకాశమే లేదు. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో శాసన నిర్మాణ వ్యవస్థ నుంచే కార్య నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు అవుతున్న  పరిస్థితులలో శాసన వ్యవస్థ కార్యనిర్వాహణ వ్యవస్థ కూడా ఎన్నికలలో మెజారిటీ సాధించిన పార్టీ కనుసన్నల్లో ఉండే విషయం చూస్తున్నాం.కానీ న్యాయస్థానం భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక స్వతంత్రతను కాపాడుకుంటూ వచ్చిన  పరిస్థితి. ఈ పరిస్థితి నేటి వరకూ ఉండియున్నది.రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగం అమలు జరిగిన నాటినుండి నేటి వరకు మూడు వ్యవస్థల సమతుల్యాన్ని స్వతంత్ర ప్రతిపత్తిపై కాపాడు భాగంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిద్ధాంతాన్ని అనేక సందర్భాలలో తన తీర్పుల ద్వారా వెల్లడించింది. 
ప్రస్తుతం  కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగం ప్రసాదించిన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని విచ్ఛిన్నం చేసి న్యాయ వ్యవస్థ పై పెత్తనం చేయటానికి చేసే ప్రయత్నాన్ని వెలుగెత్తి చాటిన తెలుగు తేజం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ రావు గారు. న్యాయవ్యవస్థ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయే పరిస్థితి నుంచి న్యాయవ్యవస్థను కాపాడటమే కాకుండా భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరచాలి అనే విషయాన్ని  ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరియు ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థ మరియు సంస్థల  యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసి, వాటిపై పెత్తనం చెలాయించాలని అనేటువంటి ఆలోచనను ఖండిస్తున్నాం.ప్రజాస్వామ్య వాదులు మరియు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర ప్రతిపత్తిని కోరే వారు అందరూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఖండించాలని కోరుకుంటున్నాను
                              
                                 --  వ్యాసకర్త.. మత్తి. వెంకటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది, అవనిగడ్డ.