YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కొత్త పార్టీ ఏర్పాటుపై కోదండరామ్‌ కీలక నిర్ణయం..

కొత్త పార్టీ ఏర్పాటుపై కోదండరామ్‌ కీలక నిర్ణయం..

 రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో జరిగిన టీ జేఏసీ విస్తృత సమావేశంలో కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజల బతుకులు మారలేదన్న నిర్ణయానికి కోదండరామ్‌ వచ్చిన తర్వాత టీ జేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలన్న డిమాండ్‌ వచ్చింది. కానీ ఉద్యమం సంస్థగా కొనసాగించడానికి నిర్ణయించారు. కేసీఆర్‌ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడం మొదలుపెట్టిన తర్వాత టీ జేఏసీని రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఒత్తడి వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలని ప్రజలు కోరినా ముందు సున్నితంగా తిరస్కరించిన కోదండరామ్‌.. మారిన పరిస్థితులు నేపథ్యంలో ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలన్ని నిర్ణయానికి వచ్చారు. టీ జేఏసీని యథావిధిగా కొనసాగిస్తూ.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును కోదండరామ్‌ ప్రకటించారు.

కోదండరామ్‌ను పక్కన పెట్టారు
రాజకీయాల్లో మార్పు కోసం పార్టీ పెట్టాలని టీ జేఏసీ నిర్ణయించింది. ప్రజల సహకారంతో పార్టీని నడుపుతూ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో టీ జేఏసీ కీలక పాత్ర నిర్వహించింది. ప్రజాభిప్రాయాన్ని ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా మలచడంతో ముఖ్య భూమిక పోషించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ వంటి పోరాటాల్లో జేఏసీ ముందుంది. తెలంగాణ సాధనోద్యమంలో పలుసార్లు అరెస్టయ్యారు. తెలంగాణ ఆవిర్భావం 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీ జేఏసీతోపాటు కోదండరామ్‌ను పక్కన పెట్టారు. ఏడాదిన్నరపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్‌... ప్రత్యేక రాష్ట్రంలో కూడా పరిస్థితులు మారలేదన్న నిర్ణయానికి వచ్చారు.

బలవంతపు భూసేకరణలు 
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు లేవంటూ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణలకు వ్యతిరేకంగా పోరాడారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్య బాట పట్టిన అన్నదాత కుటుంబాల ఆవేదనను చూసి చలించిపోయారు. ఊరూరు తిరుగుతూ కేసీఆర్‌ సర్కారు విధానాలను ఎండగట్టారు. ఉద్యమ సమయంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను కూడగట్టి కొలువుల కోసం కోట్లాట నిర్వహించారు. కొలువు కొట్లాట నిరసనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా నిర్బంధకాండ విధించడంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుని సభ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ విధానాలపై పోరాడే క్రమంలో అధికార పార్టీ నేతలు కోదండరామ్‌ను కాంగ్రెస్‌ ఏజెంటుగా విమర్శించినా ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం అవనుసరిస్తున్న ఇలాంటి విధానాలతో విసిపోయిన టీ జేఏసీ ఇప్పుడు కొత్త రాజకీయని ప్రకటించి, ఎన్నికల క్షేత్రంలో దిగాలని నిర్ణయించడం టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందేనని భావిస్తున్నారు. 

Related Posts