YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

160 భాషల్లో అవతార్ 2

160 భాషల్లో  అవతార్ 2

ముంబై, ఏప్రిల్ 27,
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం అవతార్ (Avatar 2). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 25 బిలియన్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించాడు డైరెక్టర్ జేమ్స్. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అవతార్ సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవతార్ 2 సినిమాను 2020లోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా షూటింగ్.. బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆలస్యం కావడంతో అవతార్ 2 సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని 2022లో విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్.తాజాగా అవతార్ 2 సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏకంగా 160 భాషలలో విడుదల చేయబోతున్నారట. ఇక అదే జరిగితే సినీ చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్ ఇదే.. ఈ సినిమా గ్లింప్స్ ను సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట.. అలాగే హాలీవుడ్ మూవీ డైరెక్టర్ స్ట్రేంజ్ మ్యా్డ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts