YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సినిమాలనుఆదుకుంటున్న ఓటీటీలు

సినిమాలనుఆదుకుంటున్న ఓటీటీలు

హైదరాబాద్, ఏప్రిల్ 26,
తన తర్వాతొచ్చిన పాన్ ఇండియా హీరోలు వెయ్యి కోట్ల మార్క్‌ను చేజ్ చేస్తుంటే.. ప్రభాస్ మాత్రం సైలెంట్‌గానే సిట్యువేషన్‌ని ఎనలైజ్ చేస్తున్నారు. మారుతున్న వాతావరణాన్ని పరిశీలిస్తూ వాట్ నెక్స్ట్ అనే గ్రౌండ్ రియాలిటీని చెక్ చేసుకుంటున్నారు. నాటోన్లీ ప్రభాస్… మిగతా హీరోల్లో కూడా అటువంటి మారుమనసే కనిపిస్తోందిప్పుడు. థియేటర్‌ రన్‌ చాలా త్వరగానే కంప్లీట్ చేసుకుని, డిజిటల్ ఆడియన్స్‌ని కూడా టచ్ చేసింది రాధేశ్యామ్. ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకుడి మీద ఆశలు పెట్టుకుంది. ఈ ఆదివారమే వస్తున్నా.. ఇంటిల్లిపాదీ చూసి ఆదరించండి అంటూ సోషల్ మీడియాలో ప్రమో ట్యాగ్‌ చేశారు రాధేశ్యాముడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్నెల్లకో ఏడాదికో రేర్‌గా ఒక పోస్ట్‌ పెట్టే డార్లింగ్.. ఇలా సడన్‌గా టీవీ స్లాట్ ప్రమోషన్‌కి పూనుకోవడం డైహార్డ్ ఫ్యాన్స్‌కి కొత్తగా వుంది.బిగ్‌ స్క్రీన్స్‌పై బిగ్ విక్టరీకి నోచుకుని చాలా రోజులు కావడంతో బీటౌన్ స్టార్ అక్షయ్ కూడా.. పక్కచూపులు చూస్తున్నారు. పాండమిక్ తర్వాత అక్షయ్ చేసిన బెల్‌బాటమ్‌ నుంచి బ్యాక్‌టుబ్యాక్ అన్నీ డిజాస్టర్సే. లేటెస్ట్‌గా డైరెక్టర్ ఆనంద్‌ ఎల్ రాయ్‌తో కలిసి అత్రాంగిరే టెలివిజన్ ప్రీమియర్స్‌ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు అక్కీభాయ్. టాలీవుడ్‌లో కొందరు మీడియం రేంజ్ హీరోలది కూడా ఇదే వరస, కష్టపడి చేశా… కాకపోతే ఫలితమే అటూఇటూ అవుతోంది అంటూ గని రిజల్ట్ విషయంలో ఎమోషనల్‌ ఐన మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్… ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో రిలాక్స్ అవుతున్నారు. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న గని.. గుడ్ నంబర్స్‌ స్కోర్ చేస్తూ డిజిటల్ రిలీజుల్లో రికార్డుల వైపు దూసుకెళుతోంది.

Related Posts