YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చిరుతో రాజమౌళి

చిరుతో రాజమౌళి

హైదరాబాద్, ఏప్రిల్ 23,
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్‌తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ చీప్ గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. స్టార్ హీరోల సంగతేమోగానీ.. రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది. అంతేకాదు.. ఆచార్య వేదిక పై బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని.. ఆ కొత్త సినిమాను ఆచార్య ఈవెంట్‌లో ప్రకటించబోతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్టు క్రేజీగానే ఉన్నప్పటికీ.. అసలు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహంగా మారింది.ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈవెంట్‌లో.. ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఆ వేదికపై త్రివిక్రమ్ చేయి పట్టుకొని మరీ ఎంతో ఎగ్జైటింగ్‌గా ప్రకటన చేశారు చిరు. త్రివిక్రమ్ కూడా ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్‌ పై మాట దాటేస్తూ వస్తున్నాడు.. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు రాజమౌళితో కూడా.. ఆచార్య వేదికపై చిరు కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌లాగే రాజమౌళి ప్రాజెక్ట్ కూడా ప్రకటనకే పరిమితం కానుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు టైం కేటాయించాల్సిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్‌తో ఓ సినిమా చేయబోతున్నారు జక్కన్న. ఇక చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. దాంతో ఈ కాంబినేషన్ ఈవెంట్‌ ఎగ్జైట్‌మెంట్‌ కోసమేనని.. ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఉదాహరణగా చిరు-త్రివిక్రమ్ అనౌన్స్మెంటేనని చెప్పొచ్చు. అయితే అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన ఉంటుందో లేదో చూడాలి

Related Posts