YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

20వ తేదిన తాడేపల్లి గూడెంలో ధర్మపోరాట సభ

20వ తేదిన తాడేపల్లి గూడెంలో ధర్మపోరాట సభ
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో వున్నారని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు. ఏలూరులోని ఆయన స్వగృహంలో శుక్రవారం ఉదయం లబ్దిదారులకు 4 లక్షల 90 వేల 10 రూపాయల సియం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీకి చెందిన గోరిపర్తి గోవర్థనరావు భార్య లిల్లీపుష్పకు రు.20 వేలు, వేలేరు కు చెందిన రాఘవమ్మకు 25 వేలు, చింతలపూడి చెందిన రాము కృష్ణమూర్తికి 2 లక్షల 50 వేల రూపాయలు, టి .నరసాపురం నకు చెందిన సత్తెనపల్లి వెంకటేశ్వరరావుకు 1లక్ష 95 వేల 10 రూపాయల చెక్కులను మాగంటి బాబు అందజేశారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యం ఉంటేనే సమాజంలో కూడా ఆరోగ్యవంతమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. నిరుపేదలు కూడా ఆరోగ్యంగా నిండునూరేళ్లు జీవించాలనే ఉద్దేశ్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం జరుగుతోందన్నారు.
20వ తేదిన తాడేపల్లి గూడెంలో ధర్మపోరాట సభ 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 20వతేదీని పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడెంలో ధర్మపోరాట సభ నిర్వహి ంచనున్నారని మాగంటిబాబు చెప్పారు. కేంద్రఇచ్చిన హామీలు నెలవేర్చేవరకు ఈ దర్మపోరాట సభలు ప్రతి జిల్లాలోను నిర్వహించడం జరుగుతోందన్నారు.రాష్ట్రం పట్ల కేంద్రం అనుచిత వైఖరిని ప్రజలకు వివరిస్తూ జిల్లాల వారీగా ధర్మపోరాల సభలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే 5 జిల్లాల్లో నిర్వహించిన ధర్మపోరాట సభలకు ప్రజలు పూర్తిమద్దతుతెలిపి విజయవంతం చేశారన్నారు. ఈనెల 20వ తేదీన తాడేపల్లిగూడెం, అక్టోబర్ 2న విజయనగరం, నవంబర్ 2న నెల్లూరు, నవంబర్ 4న శ్రీకాకుళం, డిశెంబర్ 2న అనంతపురం జిల్లాలోను డిశెంబర్ 4వ తేదీన అమరావతిలో ధర్మపోరాట సభలు జరుగుతాయని మాగంటి బాబు చెప్పారు. 
12వ తేదీన పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గ్యాలరీ లో నడకః పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే అంతర్బాగంలో నిర్మించిన 1156 మీటర్ల పొడవుగల గ్యాలరీలో ఈనెల 12వ తేదీన మంత్రులు , ఎంఎల్‌సిలు, ఎంఎల్ఏ లు కలిసి నడుస్తారని మాగంటి బాబు చెప్పారు. ప్రాజెక్టు కీలక పనులు పూర్తయ్యాయని చెప్పేందుకు వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో గ్యాలరీ నడక నిర్వహిస్తారని అన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వహణకు వీలుగా స్పిల్ వేలో చేసిన ఏర్పాటు ఈ గ్యాలరీ అని, ఇది ఒక గుహలా ఉంటుందని మాగంటి బాబు చెప్పారు. పోలవరం స్పిల్ వే ముఖ్య భాగం పూర్తయిన నేపధ్యంలో ఈగ్యాలరీ నడక ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు. ఈకార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించే అవకాశం వుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సరవేగంగా సాగుతున్నాయని , ఇప్పటికే 59 శాతం పనులు పూర్తయ్యాయని మాగంటి బాబు చెప్పారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం మాజీ సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష, ఎంపిటిసిలు మాకాల రమేష్, పైడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Related Posts