YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్ని వర్గాల నుంచి వైసీపీపై వ్యతిరేకత

అన్ని వర్గాల నుంచి వైసీపీపై వ్యతిరేకత

 

ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ప్రతిపక్షం కోసం మనం పనిచేయడం లేదు...ప్రజల కోసం పనిచేస్తున్నా’మని తెలిపారు. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఎందుకు సభకు వెళ్లరని వైసీపీని ఉపాధ్యాయులు నిలదీశారని...అందుకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజల్లో ప్రతిపక్షంపై తీవ్ర వ్యతిరేకత ఉందని. ప్రాథమిక బాధ్యతలను ప్రతిపక్షం విస్మరించిందని ఆయన వ్యాఖ్యానించారు. సభకు హాజరుగాని సభ్యత్వం వృధా అని.. ప్రతి సమావేశానికి హాజరుకావడం సభ్యుడి ప్రాథమిక బాధ్యత అన్నారు. ప్రశ్నలు వేయడం, స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలు అర్ధవంతంగా జరగాలని అన్నారు. కౌన్సిల్‌లో రాజధాని నిర్మాణంపై జరిగే చర్చలో అందరూ పాల్గొనాలని సీఎం సూచించారు. అనుబంధ ప్రశ్నల ద్వారా లోతైన చర్చ జరిగేలా శ్రద్ధ చూపి విషయ పరిజ్ఞానంతో వాస్తవాలను ప్రజల్లోకి పంపాలన్నారు. ప్రతిపక్షం ఉన్నప్పుడే వ్యూహాలు ఉండటం కాదని.. ప్రజలను మెప్పించే వ్యూహాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారుప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ బాగా జరిగిందనే పేరు రావాలని ఆకాక్షించారు. ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని.. వారంతా సానుకూల దృక్ఫథం గలవారన్నారని సీఎం తెలిపారు. ప్రతికూల స్వభావాన్ని ప్రజలు సహించరని.. బాధ్యతా రాహిత్యాన్ని అసలే సహించరని చంద్రబాబు చెప్పారు.

Related Posts