YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టిన ఏఐసీసీ..

కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టిన ఏఐసీసీ..

కాంగ్రెస్ పార్టీని కేడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దేదుకు పార్టీ అగ్ర నాయకత్వం చర్యలు చేపట్టింది.  రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండలం, గ్రామ పంచాయితీ, పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ నాయకులను గుర్తించి వారి   గురించిన వివరాలను ఏఐసీసీ సేకరిస్తుందని శుక్రవారం ఢిల్లీలో జరిగిన వార్ రూమ్  సమావేశంలో  పార్టీ అగ్ర నేతలు  స్పష్టం చేశారు. 

ఇకపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరుగుతుందని... పని చేసే ప్రతిఒక్కరికీ తగిన విధంగా గుర్తించేందుకే ఏఐసీసీ ఇలాంటి కార్యాచరణ చేపట్టిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక గెహ్లాట్ శుక్రవారం  జరిగిన వార్ రూమ్ సమావేశంలో స్పష్టం చేశారు.  ఏపీసీసీ నుంచి ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, ప్రధాన కార్యదర్సులు జంగా గౌతమ్,ఎస్ ఎన్ రాజా, సూరిబాబులు హాజరయ్యారు. పార్టీ ని ప్రజలకు దగ్గర చేసేందుకు , సమాజంలో గుర్తింపు వున్న ప్రముఖుల సలహాలు, సేవలను కాంగ్రెస్ తీసుకునే విధంగా అన్ని స్థాయిల్లో పనిచేయాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు ఏపీసీసీ నేతలు చెప్పారు. "శక్తి యాప్" రాహుల్ గాంధీ గారి సందేశాలను ఇకపై బూత్ స్థాయి నాయకులకు, పార్టీ అభిమానులకు . ప్రాంతీయ భాషల్లో నేరుగా చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇకపై స్థానిక ప్రజా సమస్యలను అశ్రద్ధ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏఐసీసి నాయకులు దిశా నిర్దేశం చేశారన్నారు. ప్రాంతీయ పార్టీలను, బీజీపీ, దాని అనుబంధ విభాగాలు కాంగ్రెస్ పైన చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలని నిర్ణయించారు..ఇకపై అన్ని స్థాయిల్లో పార్టీ శిక్షణా తరగతులు నిరంతరం జరపాలని, కాంగ్రెస్ విధానాలు, చరిత్ర ఎప్పటికప్పుడు తెలియజేయాలని నిర్ణయించినట్టు పీసీసీ నేతలు చెప్పారు 

Related Posts