YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రతిపక్షాలు

కేసీఆర్  వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రతిపక్షాలు

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర విషయాల్లో దూసుకుపోతుండగా కాంగ్రెసు, టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాయి. పొత్తులపై చర్చలతో కాలం గడుస్తోంది. దీంతో ఆందోళన మరింత అధికమవుతోంది. మొదట్లో కేసీఆర్‌ పట్ల విముఖంగా మాట్లాడిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ క్రమంగా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ఎన్నికలు ఆలస్యమైతే బాగుండునని కాంగ్రెసు కోరుకుంటోంది. కొద్దిగా జాప్యం జరిగితే కాలూచేయి కూడదీసుకోవచ్చని దాని ఆశ. ఈ పరిస్థితిలో ఈసీ తీసుకున్న ఓ నిర్ణయం ఆశాజనకంగా కనబడుతోంది. ఏ ఎన్నికల ముందైనా ఓటర్ల జాబితా సవరించి, మార్పులు చేర్పులు చేసి కొత్త జాబితా ప్రకటించడం ఆనవాయితీ. కాని ఈసీ ఆ ఆనవాయితీకి స్వస్తి పలకడంతో మండిపడుతున్న కాంగ్రెసు కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది.వాస్తవానికి 2019 జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్లు నిండినవారితో తాజా ఓటర్ల జాబితా తయారుచేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనతో ఈ కార్యక్రమం సాగుతోంది. కాని కేసీఆర్‌ హఠాత్తుగా ముందస్తు ఎన్నికలకు తెరలేపడంతో ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపేసి 2018 జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.దీనిపై మండిపడిన కాంగ్రెసు ఓటర్ల జాబితా సవరణ నిలిపేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై కోర్టుకు వెళతామని తెలిపింది. కేసీఆర్‌ ఎన్నికల సంఘాన్ని కూడా మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఓటర్ల జాబితా సవరణ ఆపకూడదని, అది ముగించాకే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయన్నారు.కాంగ్రెసు ఒకవేళ కోర్టుకు వెళ్లి ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తే, ఆ పిటిషన్‌ను కోర్టు విచారణకు తీసుకుంటే ఎన్నికల నిర్వహణ జాప్యం కావొచ్చని అనుకుంటున్నారు. కేసీఆర్‌ దూకుడు కారణంగా కేవలం కాంగ్రెసు మాత్రమే కాదు, అన్ని ప్రతిపక్షాలూ ఇబ్బంది పడుతున్నాయి. బీజేపీ మినహా ఏ ప్రతిపక్షమూ పొత్తులు లేకుండా పోటీచేసే పరిస్థితి లేదు. ఈ పార్టీలు సీట్ల పంపిణీపై చర్చలు జరుపుతుండగానే కేసీఆర్‌ పరుగులు పెడుతున్నారు.  విభజన తరువాత ఎన్నికల్లో తెలంగాణలోనే కాంగ్రెసు కొద్దిగా బెటర్‌. కొన్ని సీట్లయినా వచ్చాయి. ముందస్తు ఎన్నికలు ప్రకటించడానికి ముందువరకు అధికారంలోకి వస్తామని కాంగ్రెసు బల్లగుద్ది చెప్పేది. కాని కేసీఆర్‌ ముందస్తు వ్యూహం ముందు కాంగ్రెసు పార్టీ నిలువలేకపోతోంది.

Related Posts