YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టార్గెట్ కాంగ్రెస్

టార్గెట్ కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్ర సమితి ఆల్రెడీ 105 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన జిల్లా కేవలం 14 స్థానాలు. అందులో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవి 3, భాజపా స్థానాలు 4, మజ్లిస్ కు చెందినవి 2, పెండింగ్ లో పెట్టిన తెరాస సీట్లు మరో 5 ఉన్నాయి. ఈ సీట్లకు గట్టి అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాస్త ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గులాబీ  సరైన నేతల వేటలో ఉంది. పార్టీవర్గాల ద్వారా తెలుస్తున్న సంగతేంటంటే కాంగ్రెస్ కు  చెందిన మూడు స్థానాలలో చాలా గట్టి అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా ఆ పార్టీలో కంగారెత్తించాలని  కేసీఆర్ తలపోస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఇంకా అభ్యర్థిని ప్రకటించకుండా వదలిపెట్టిన కాంగ్రెస్ స్థానాలు ఏమిటి? అనేదే ఇప్పుడు కీలకాంశం. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితర సీట్లకు తెరాస ఇంకా తమ అభ్యర్థులను మోహరించలేదు. ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ వారు గట్టి అభ్యర్థులే కాగా వారిని కూడా ఖంగు తినిపించగల గెలుపు గుర్రాల కోసం తెరాస అన్వేషిస్తోంది.ఉత్తమ్ కుమార్ మీద గాని ఆయన భార్య మీద గాని సీనియర్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీచేయడం దాదాపుగా ఖరారైనట్లే. అలాగే గీతారెడ్డి మీద పోటీ చేయడానికి పార్టీలోని సీనియర్ ఎస్సీ నాయకుడిని కేసీఆర్ ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన సిట్టింగ్ సీట్ల మీద కూడా కేసీఆర్ ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం.వారి ఐదు స్థానాలలో ఒక ఉప్పల్ కు మాత్రమే గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడికి తిరిగి టికెట్ ఇచ్చారు. నాలుగు స్థానాలకు ఎంపిక ఇంకా జరుగుతోంది. అందుకోసం పరిశీలిస్తున్న ప్రాబబుల్స్ లో దానం నాగేందర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తదితరులు ఉన్నారు.కాస్త లోతుగా  గమనిస్తే ... కేసీఆర్ ప్రభుత్వాన్ని పతనం చేస్తాం, కుటుంబ పాలన అంతం చేస్తాం లాంటి భీషణ ప్రతిజ్ఞలు చేసిన కాంగ్రెస్, భాజపా నాయకులకు ఈ ఎన్నికలలో చెక్ పెట్టడం ద్వారా, ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Related Posts