YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ లేడి అమితాబ్ యాక్టివ్ అవుతారా

మళ్లీ లేడి అమితాబ్ యాక్టివ్ అవుతారా

ఒకప్పట్లో లేడీ అమితాబ్ గా, ఫైర్ బ్రాండ్ మహిళామణిగా ముద్ర పడిన విజయశాంతి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు? ఇలాంటి ప్రశ్న హఠాత్తుగా అడిగితే తటాల్న జవాబు చెప్పడం కష్టం. ఏయే సందర్భాల్లో ఆమె ఎటు నుంచి ఎటు పార్టీలు మారి, పార్టీలు స్థాపించి.. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో గుర్తుచేసుకోవడానికి కొంత సమయం అవసరం. ఇంతకూ ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. కొన్ని నెలల కిందటే.. ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.పార్టీకోసం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానని అప్పట్లో ప్రకటించారు కూడా! అంతే ఆ ఒక్కరోజు తప్ప.. మళ్లీ విజయశాంతి వార్తల్లో కూడా కనిపించలేదు. ఇన్నాళ్లకు తెలంగాణ ముందస్తు ఎన్నికలు ముంచుకు వచ్చేసిన తర్వాత.. కొందరికి విజయశాంతి ఊసు కూడా గుర్తుకొస్తోంది. నిజానికి ఆమె రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత.. ఏనాడూ రాష్ట్ర కాంగ్రెస్ లో క్రియాశీలంగా కనిపించలేదు. తన ఎరీనా కేంద్ర రాజకీయాలే తప్ప.. రాష్ట్ర పార్టీతో నిమిత్తం లేదని ఆమె భావించారేమో కూడా తెలియదు.అలాంటిది.. అంతో ఇంతో తెలంగాణలకు ప్రజలకు తెలిసిన నాయకురాలు అయిన విజయశాంతిని ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వాడుకుంటుందా? లేదా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. విజయశాంతి తనకు మరో ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ లో చేరారే గానీ.. ఏనాడూ చురుగ్గా వ్యవహరించలేదు. పైగా రాష్ట్ర నాయకులతో ఆమెకు పెద్దగా సఖ్యత కూడా లేదు. అటు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం.. ఈ దఫా చాలా విషయంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచనలకే పెద్దపీట వేస్తూ వచ్చింది.ఇలాంటి నేపథ్యంలో విజయశాంతిని కీలకమైన అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించాలా వద్దా? అనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఆమె గతంలో ఎంపీగా పనిచేశారు. అలాంటప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెను ఎంపీగానే దించవచ్చు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో  దించితే.. ఒక స్థానానికి పరిమితం అయిపోతుందని.. అలాకాకుండా.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆమె ఫైర్ బ్రాండ్ విమర్శల్ని రాష్ట్రమంతా ప్రచారానికి వాడుకోవాలని కూడా పార్టీలో కొందరు భావిస్తున్నారు. మరి లేడీ అమితాబ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Posts