YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పక్కా ఆధారాలతో జగ్గారెడ్డి ఆరెస్టు

పక్కా ఆధారాలతో జగ్గారెడ్డి ఆరెస్టు

ఆదివారం ఉదయం వచ్చిన విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేసాం. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ పాస్ పోర్ట్ తో అమెరికాకు వెళ్లినట్లు తేలింది. తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేర్లపైన వేరే వారిని తీసుకు వెళ్లినందుకు గాను మనుషుల అక్రమ రవాణా కేసు నమోదు చేసినట్లు తెలిపిన హైదరాబాద్ నార్త్ జోన్  డీసీపీ సుమతి తెలిపారు. జగ్గారెడ్డి ఆరెస్టు విషయం వెల్లడిస్తూ అయన నకిలీ పాస్పోర్ట్ ల పైన వేరేవాళ్లను  అమెరికా కు తీసుకు వెళ్లాడని, వారు ప్రస్తుతం కూడా అక్కడే ఉన్నారని అన్నారు. వారిని అక్కడికి తర లించినందుకు గాను ఒక్కొక్కరికి 5లక్షలు చొప్పున 15లక్షలు ఎజెంట్ మధు నుండి తీసుకున్నట్లు తేలిందని తెలిపారు. తాను ఎమ్మెల్యే గా ఉన్న 2004లోనే ఈ చర్యకు పాల్పడినట్లు ఆమె అన్నారు. జగ్గారెడ్డి ని అరెస్ట్ చేసిన తరువాత జగ్గారెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు నాలుగు, ఫ్యామిలీ ఫొటోలు  స్వాధీనం  చేసుకున్నారు. మార్కెట్ పోలీసులు,  నార్త్ జోన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి అరెస్ట్ చేసినట్లు  డీసీపీ వివరించారు. 

Related Posts