YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఘనంగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవము అమరుల స్పూర్తితో అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపుకు కృషి రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న

ఘనంగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవము   అమరుల స్పూర్తితో అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపుకు కృషి               రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న
దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 వ తేదీన "అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవముగా” జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం లో  బాగముగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 వ తేదీన "అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా” జరపుకోవాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగాజూపార్క్ లో నిర్వహించిన కార్యక్రం లో మంత్రి పాల్గొని  విధినిర్వహణలో వన సంపద సంరక్షణ కొరకు జీవితములను త్యాగము చేసిన  అటవీ సిబ్బందికి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బబ్గా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 1984వ సంవత్సరము నుండి ఇప్పటివరకు (21) అటవీ సిబ్బంది ధైర్య సాహసాలతో అంకిత భావంతో పనిచేసి అటవీ నేరములకు పాల్పడిన నేరస్తులను పట్టుకొనుటలో, అటవీ సంపద పరిరక్షణలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారన్నారు.అటవీ శాఖలోని అధికారులు మరియు సిబ్బంది తమ కర్తవ్యంలో భాగంగా అడవులు మరియు వన్య ప్రాణులను రక్షించటంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తమ శాయశక్తుల కృషి చేసి అటవీ రక్షణలో భాగంగా 2017-2018 సంవత్సరములో టేకు మరియు మారు జాతి కలపకు సంబంధించిన నేరములను మరియు అటవీ భూ ఆక్రమణ కేసులను కూడా పెద్దసంఖ్యలో నమోదు చేసినారు.  2017-2018 సంవత్సరానికిగాను రూ.లు 4.05 కోట్ల కలప విలువ కలిగిన 9025 కేసులు నమోదు చేసి రూ.లు 12.59 కోట్ల జరిమానా వసూలు చేయడం మరియు 1923 వాహనములను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది.   నేరస్తులు తెలియని కేసులు 3268 నమోదు చేసి రూ. లు 7.85 కోట్ల విలువ కలిగిన టేకు మరియు మారు జాతి కలపను స్వాధీనపర్చుకొని జప్తు చేసినారు. అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యముతో ఎన్నో పథకాలను మరియు చర్యలను చేపట్టటము జరుగుతుందని,145 బేస్ క్యాంపులను 62 స్ట్రైక్ ఫోర్స్ పార్టీలను మరియు 58 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడము జరిగిన్దన్నారు. అడవి సరిహద్దుల నిర్వహణకు పశువులు అడవిలో చొరబడకుండా నియంత్రించే కాలువలు నిర్మించి గచ్చకాయ నాటుట ద్వారా అడవి సంరక్షణకు దోహదం పద్దమన్నారు. సాయుధ పోలీసు దళాలు కలప అక్రమ రవాణా అరికట్టడానికి  తోడ్పాటును అందిస్తున్నామన్నారు. పి. డి. యాక్టు ప్రకారము టేకు అక్రమ రవాణాదారులను కూడా అరెస్టు చేయడము జరుగుచున్నదని తెలిపారు. అగ్గి బారి నుండి అడవులు కాపాడుటకు ముమ్మర ప్రయత్నం జరుగుచున్నదన్నారు.పెద్ద ఎత్తున ఫైర్ లైన్ ఏర్పాటు, అగ్గి నష్టం పై అవగాహన కల్పించుట ద్వారా అగ్గి ప్రమాదాలు అరికట్ట గలిగామన్నారు.
అటవీ శాఖ సిబ్బందిని మరింత బలోపేతం చేయడానికి ఆయుధాలు ఇవ్వడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ అటవీ చట్టం 1967 మరియు పి.డి. యాక్టు కి తగిన సవరణలు చేసి నేరస్తులకు  కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అటవీ సంరక్షణ బలోపేతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2173 వాహనాలు, (2008 మోటారు  సైకిళ్ళు, ఎఫ్.బి.ఓ నుండి డి.ఆర్.ఓ వరకు, (100) మహీంద్ర తార్ జీపులు అటవీ క్షేత్రాధికారులకు, 25 మహీంద్ర స్కార్పిఓస్ అటవీ మండలా ధికారులకు, (3) మహీంద్రా బోలెరో వాహనాలను అటవీ మండలాధికారులకు, (8) ఇన్నోవాలను, (9) హోండా సిటీలను మరియు (5) ఫార్చునర్స్ లను అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారులకు) ఇవ్వడం జరిగిందన్నారు. అడవుల్లో గడ్డి భూముల అభివృద్ది, నీటి వసతుల ఏర్పాటు చేసి, వన్యప్రాణులు పంట పొలాలు పశువుల పై దాడులు తగ్గించ గలిగామన్నారు.తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హారము పథకం ద్వారా మన రాష్ట్రములో (90) కోట్లకు పైగా మొక్కలను నాటటం జరిగింది.  రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల మొక్కలు నాటుటకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Related Posts