YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిజెంబర్ 28 నుంచి వైజాగ్ ఉత్సవ్

డిజెంబర్ 28 నుంచి వైజాగ్ ఉత్సవ్

ఏటా విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించే ‘విశాఖ ఉత్సవ్’ వేడుకల తేదీ ఖరారైంది. నగరంలోని ఆర్కే బీచ్‌లో మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే హస్తకళలు, వివిధ కళాఖండాలే కాకుండా సంగీత, నృత్య కార్యక్రమాలకూ విశాఖ ఉత్సవ్‌ వేదిక కానుంది. మీరూ ఈ వేడుకల్లో పాల్గోవాలంటే.. మరికొద్ది నెలలు వేచి చూడాల్సిందే. ఈ ఏడాది డిసెంబరు 28, 29, 30 తేదీల్లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పిల్లల కోసం అమ్యూజ్మెంట్ జోన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్‌కోర్టులతోపాటు బీచ్ సకార్, త్రో బాల్ క్రీడలు కూడా నిర్వహిస్తారు. జానపద నృత్యాలు, ట్రైబల్ జోన్, అడ్వేంచర్లు, ఫ్లవర్ షో, కార్నివాల్ పెరేడ్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

Related Posts