YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్‌బాస్ హౌస్‌లోకి వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్..!!

 బిగ్‌బాస్ హౌస్‌లోకి వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్..!!

హిందీ బుల్లితెరపై త్వరలోనే బిగ్‌బాస్-12 ప్రసారం కాబోతోంది.  ఈ షోలోకి  టీమిండియా వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నాడు. బిగ్‌బాస్-12 సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లబోయే వారి పేర్లను అధికారికంగా విడుదల చేశారు. వీరిలో టీమిండియా క్రికెటర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ కూడా ఉన్నాడు. మొత్తం 18 మంది బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు గడపనున్నారు. తెలుగు బిగ్‌బాస్‌లానే హిందీలోనూ ఈసారి కామన్ మెన్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. కాగా, షోలో తొలిసారి కొందరు జంటగా వెళ్లబోతున్నారు. షోలో తొలిసారి ఓ రైతుకి కూడా అవకాశం కల్పించడం విశేషం.

Related Posts