YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు అనుభవాలను ప్రపంచం వినాలనుకుంటోంది సీఎంకు ఐక్యరాజ్యసమితి లేఖ

చంద్రబాబు అనుభవాలను ప్రపంచం వినాలనుకుంటోంది సీఎంకు ఐక్యరాజ్యసమితి లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. 90'ల్లో ఆయన ఐటికి ఇచ్చిన ప్రాధాన్యత చూసి, అమెరికా అధ్యక్షుడే ముగ్ధుడు అయ్యాడు అంటే, ఆయన సత్తా ఏంటో చెప్తుంది. ఆయన విజన్ చూసి, మైక్రోసాఫ్ట్ వచ్చింది, సైబరాబాద్ అనే సిటీ నిర్మాణం జరిగింది. అయితే, ఎక్కువగా ఆయన ఐటి వైపు వెళ్ళటం కూడా, ఆయనకు ఎన్నికల్లో ఇబ్బంది అయ్యేలా చేసింది. అది గతం.. ఇప్పుడు 2018లో ఉన్నాం.. 20 ఏళ్ళ నాడు ఐటికి ప్రాధాన్యత ఇచ్చి, దేశానికే మార్గదర్శం అయితే, ఇప్పుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టి, దేశంలో మిగతా రాష్ట్రాల వారికే కాదు, ప్రపంచానికే ఆదర్శం అయ్యింది ఆంధ్రప్రదేశ్.ఇదే విషయం ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. దీనికి సమబందించి, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెం, చంద్రబాబుకి లెటర్ రాసారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 24 నుంచి జరుగుతుందని, ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ టాపిక్ మీద మీరు ప్రసంగించాలి అంటూ లెటర్ రాసారు.మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంది. సామాజికంగా, ఆర్ధికంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, మీరు తీసుకుంటున్న చర్యలు అమోఘం. ముఖ్యంగా, మీరు మీ రాష్ట్రంలో, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి ఇస్తున్న ప్రాధాన్యత, వాటి ఫలితాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఈ ప్రపంచం, మీ నుంచి, మీ అనుభవాలు వినాలని అనుకుంటుంది. మీ అనుభవాలు మాతో వచ్చి పంచుకుంటారని ఆశిస్తున్నా అంటూ, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబుకి లేఖ రసారు. ఇది చంద్రబాబు చేస్తున్న విధానాల వల్ల, మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న గుర్తింపు... జయహో ఆంధ్రప్రదేశ్..

Related Posts