YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తాడేపల్లిగూడెం కోసం 20 ఏళ్ల నుంచి టీడీపీ ఎదురు చూపులు

 తాడేపల్లిగూడెం కోసం 20 ఏళ్ల నుంచి టీడీపీ ఎదురు చూపులు

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 తర్వాత ఇక్కడ గెలవలేదు. ఇక గత నాలుగు ఎన్నికల్లోనూ నాలుగు పార్టీలకు ఇక్కడ ఓటర్లు పట్టం కట్టి తమ ప్ర‌త్యేక‌త‌ చాటుకున్నారు. 1999లో టీడీపీ 2004లో కాంగ్రెస్‌ 2009లో ప్రజారాజ్యం 2014లో బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు నేపథ్యంలో బీజేపీలో నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పైడికొండల మాణిక్యాలరావుకు సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో బలంగా వీచిన టీడీపీ గాలుల నేపథ్యంలో మాణిక్యాలరావు వైసీపీ అభ్యర్థి తోట గోపిపై ఘ‌న‌విజయం సాధించారు.ఇక వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నా పవన్‌ కళ్యాణ్‌ జనసేన జిల్లాల్లో తాము గెలుచుకునే మొదటి మూడు సీట్లలో తాడేపల్లిగూడెం ఉంటుందని ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది. కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ మంత్రి య‌ర్రా నారాయణస్వామి తనయుడు య‌ర్రా నవీన్‌ ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన తర‌పున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయనకు గూడెం సీటుపై హామీతోనే ఆ పార్టీలో చేరినట్లు కూడా టాక్‌. సామాజిక సమీకరణల పరంగా గూడెం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం నుంచి ఈలి నాని గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ట్రైయాంగిల్‌ ఫైట్‌లో తాము విజయం సాధిస్తామని జనసేన లెక్కలు వేసుకుంటుంది. అయితే నాటికి నేటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉంది. నాడు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకుడు లేని పరిస్థితి. ఇప్పుడు జడ్పీ చైర్మ‌న్ బాపిరాజు చేసిన అభివద్ధి టీడీపీకి చాలా ప్లస్‌గా మారనుంది. ఈ నేపథ్యంలో మరి జనసేన ఆశలు ఎంత వరకు నెరవేరతాయో చూడాలి. ఏదేమైనా గూడెంలో ఈ సారి ర‌స‌వ‌త్త‌ర పోరు ఖాయ‌మే.అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా పైడికొండలకు బాబు కేబినేట్‌లో దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా వచ్చింది. నాలుగేళ్ల పాటు ఆయన నియోజకవర్గ అభివృద్ధి కంటే టీడీపీ నాయకులతో ఉన్నా వైరుధ్యాల నేపథ్యంలో వాళ్లతో ఫైట్‌ చేసేందుకే ఎక్కువ సమయం కేటాయించినట్లు కనపడుతోంది. జడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు, మంత్రి మాణిక్యం మధ్య నాలుగేళ్ల పాటు నిత్యం రాజకీయ యుద్ధమే నడిచింది. విమర్శలు, ప్రతివిమర్శలతో నాలుగేళ్లలో మంత్రిగా ఉన్న మాణిక్యం అభివృద్ధిలో అంచనాలను అయితే అందుకోలేదు. ఇక ప్రస్తుతం బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు బ్రేకప్‌ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎవరు బరిలో ఉంటారో, బీజేపీ నుంచి మళ్ళీ మంత్రి మాణిక్యమే పోటీ చేస్తారా, వైసీపీ పరిస్థితి ఏంటి, గూడెం సీటు గెలుస్తామనే శపథాలు చేస్తున్న జ‌న‌సేన‌ లెక్కలేంటి 

 టీడీపీ విషయానికి వస్తే 2009లో ఇక్కడ పోటీ చేసిన ప్రస్తుత జడ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు మరో సారి ఇక్కడ పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లాల‌న్న తన కల‌ను నెరవేర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 29న గూడెంలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షను బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసేందుకు రకరకాల స్కెచ్‌లతో ముందుకు వెళ్లుతున్నారు. ఇప్పటికే జడ్పీ చైర్మ‌న్‌గా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకువ‌చ్చి నియోజకవర్గ చరిత్రలోనే తిరుగు లేని అభివృద్ధి చేసిన ఘ‌న‌త బాపిరాజుదే. ఇక్కడ సీటు వస్తే గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలు మాత్రం బాపిరాజుకు మైన‌స్‌గా ఉన్నాయి. జిల్లాల్లో మిగిలిన సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక బట్టి బాపిరాజుకు ఇక్క‌డ‌ సీటు వస్తుందా ? లేదా ? అన్నది చివరి వరకు వేచి చూస్తేగాని చెప్పలేని పరిస్థితి. ఇక తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మ‌న్‌ బొలిశెట్టి శ్రీనివాసుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం టీడీపీ టికెట్‌ రేసులో ఉన్నారు.ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఓడిపోయిన తోట గోపీని పక్కన పెట్టిన జగన్‌ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. నియోజకవర్గంలో గత ఐదు ఎన్నికల్లోనూ వరుసుగా పోటీ చేస్తూ వస్తూ 2004లో మాత్రమే విజయం సాధించిన కొట్టుకు చివరి క్షణం వరకు బీ ఫామ్‌ చేతికి వస్తుందా ? లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. ఆర్థికంగా ఆయన అంతంత మాత్రం ఉండడంతో ఓ ఐఏఎస్‌ అధికారి పేరును కూడా ఇక్కడ వైసీపీ పరిశీలిస్తోంది. ఇక బీజేపీ నుంచి తాజా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావే పోటీ చేస్తారా ? టీడీపీతో పోత్తులేని నేపథ్యంలో నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకుని మరి ఎవరికైన అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. బీజేపీ నుంచి ఇక్కడ పెద్దగా ఆశించేది ఏమి లేదు.

Related Posts