YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజధాని లో హైటెన్షన్

రాజధాని లో హైటెన్షన్

రాజధాని లో సోమవారం హైటెన్షన్ నెలకొంది. రాజధాని అసైడ్ భూములు రైతులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం అసైండ్ భూముల రైతులకు అన్యాయం చేస్తుందంటూ రైతులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అసైండ్ భూముల రైతులకు కూడా  పట్టా భూముల తో పాటు సమాన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు కూలీలకు ఒక్కొక్క రికి నెలకు 9000 పించన్ ఇవ్వాలని కుడా డిమాండ్ చేస్తున్నారు.  అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తుగా అసైండ్ భూముల రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   రైతు పాటు రైతు,కూలీ సంఘాల నాయకులను హౌస్ అరెస్టు చేసారు. అరెస్టు చేసిన రైతుల్ని ఏ స్టేషను కు తీసుకు వెళ్ళారో అర్ధం కాక  కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముట్టడి కార్యక్రమంతో అసెంబ్లీ చుట్టూ భారీ పోలీసు భద్రత  ఏర్పాటు చేసారు. అసెంబ్లీ వెళ్ళే అన్ని మార్గాలను చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. అసెంబ్లీ కు వెళ్ళే వాహనాల తో పాటు ఆర్టీసీ బస్సుల్ని తనిఖీ చేసారు. 

Related Posts