YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అర్ధవంతమైన చర్చలు చేయాలి : సీఎం చంద్రబాబు

అర్ధవంతమైన చర్చలు చేయాలి : సీఎం చంద్రబాబు

సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వ్యూహ కమిటి బృందంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  మంత్రులు, ఉభయ సభల విప్ లు, పార్టీ బాధ్యులు పాల్గోన్నారు.  ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇంకా 3రోజులు సమావేశాలు ఉన్నాయి అర్ధవంతమైన చర్చతో ప్రజలను ఆకట్టుకోవాలి. ఈ విరామంలో ‘జలసిరికి హారతి’ నిర్వహించాం. రైతులనుంచి మంచి స్పందన వచ్చింది. జల సంరక్షణపై ప్రజలను చైతన్య పరిచాం. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్ కు స్పందన బాగావుందని అన్నారు. యువతరానికి ఇది నిజమైన నేస్తంగా మారింది. దీనిపై ప్రతి నియోజకవర్గంలో అవగాహన పెంచాలి. బాబ్లీ ప్రాజెక్టు వారంట్లను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిరసించారు. తెలుగు వారెక్కడున్నా సుభిక్షంగా ఉండాలి. ఈ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షాభావంలో కూడా పంట దిగుబడులు తగ్గకుండా చూశాం.  సీమ జిల్లాలలో చెరువులు నింపి నీటి కొరత లేకుండా చేశాం. 24,500కోట్ల రుణ ఉపశమనం రైతులకెంతో భరోసా ఇచ్చిందని అన్నారు. దేశంలోనే వ్యవసాయ వృద్ధిరేటులో అగ్రస్థానంలో ఉన్నాం. రైతులంతా టిడిపికి అండగా ఉండటం ప్రతిపక్షానికి అక్కసుగా ఉంది. అందుకే సొంత మీడియాలో రైతు వ్యతిరేక కథనాలు ఇస్తున్నారని అయన అన్నారు. లేని ఆత్మహత్యలపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ల పదేళ్లలో రైతులకు ఏం చేశారు, మన 4ఏళ్లలో రైతులకు ఏం చేశామో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అసెంబ్లీ సమావేశాలను అందుకు వినియోగించుకోవాలి. ఒకవైపు పాత కేసులు తవ్వితోడుతున్నారు.  మరోవైపు తప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఇంకోవైపు శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారు. కొందరిని రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించేది లేదని అయన హెచ్చరించారు.

Related Posts