YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు..కేసీఆర్ ను పొగడడం వెనుక...

బాబు..కేసీఆర్ ను పొగడడం వెనుక...

ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పొత్తు చర్చలు జరుపుతూ.. మరోవైపు టీఆర్ ఎస్  అధినేత కేసీఆర్ పై తన ప్రేమను వ్యక్తీకరిస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఇలాంటి రెండు కళ్ల సిద్ధాంతాలు, రెండు నాలుకల మాటలు చంద్రబాబుకు ఏమీ కొత్తకాదు. ఈ విషయంలో పండిపోయాడు. ఇప్పుడు తరచూ కేసీఆర్ మీద ప్రేమాభిమానాలను చాటుకుంటున్నాడు. ఒకసారి కాదు.. చంద్రబాబు నాయుడు రోజూ కేసీఆర్ తో సాన్నిహిత్యాన్ని కోరుకున్నానని చెప్పుకోవడం, పెద్ద చర్చానీయాంశంగా మారింది. అంటే దానికి సమాధానం ఒక్కటే. ఓటుకు నోటు కేసు. ఈ కేసులో ఇబ్బంది తలెత్తకుండా చంద్రబాబు నాయుడు కేసీఆర్ విషయంలో ఇలా మాట్లాడుతున్నాడు. తాము తెరాసతో దోస్తీ చేద్దామని అనుకుంటే.. బీజేపీ చెడబెట్టిందని చంద్రబాబు నాయుడు వాపోతూ ఉన్నాడు. మరి అదే బీజేపీతో నాలుగున్నరేళ్లు దోస్తీ చేసింది కూడా ఈయనే. దోస్తీ చేస్తున్నంతసేపూ బీజేపీ బుద్ధి గురించి చంద్రబాబుకు తెలీలేదా? దేశంలో తనకంటే సీనియర్ లేడు, తనకన్నా మేధావి లేడు అని చెప్పుకునే చంద్రబాబుకు... అప్పుడంతా బీజేపీ కుట్రలు తెలీయలేదా?ఇక బాబుగారు ఇప్పుడు ఇలా మాట్లాడుతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తోందో లేదో కానీ.. రేపు ఎన్నికల తర్వాత చంద్రబాబు పదోపరకో ఎమ్మెల్యే సీట్లను సంపాదించుకుని.. టీఆర్ ఎస్ వైపు మొగ్గితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎలాగూ తెలంగాణలో ఉన్నది తక్కువ సీట్లే. కాంగ్రెస్ గనుక గట్టిగా కష్టపడితే.. మెజారిటీకి దగ్గరగా వచ్చినా రావొచ్చు. తెలంగాణలో ఏ ప్రభుత్వం మీద అయినా త్వరగా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ మెజారిటీకి దగ్గర దగ్గరగా వస్తే.. కేసీఆర్ కూడా దగ్గర దగ్గరగా వస్తే.. అప్పుడు చంద్రబాబు నాయుడు తన అవకాశవాదం కొద్దీ వ్యవహరిస్తాడు తప్ప.. కాంగ్రెస్ తో కలిసి పోటీచేశాం.. కాబట్టి అనే నీతిని ఏమీ ఫాలో అయ్యేరకం కాదు. అసలుకు తమతో పొత్తు అంటూ.. తెరాస అధినేతపై ప్రేమను వ్యక్తీకరిస్తున్న చంద్రబాబును కాంగ్రెస్ ఎలా నమ్ముతోందో.. అయినా సురేష్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడనుకుంటున్న అధిష్టానం జరుగుతున్న విషయాలను గ్రహించడానికి చాలా సమయాన్నే తీసుకుంటుందిలే!

Related Posts